వాషింగ్టన్: అమెరికా, రష్యాలు ఖైదీల పరస్పర విడుదల ఒప్పందం కింద అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను రష్యా విడుదల చేసింది. బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను అమెరికా– రష్యాకు అప్పగించింది. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన గ్రినర్‌ను రష్యా పర్యటనలో ఉండగా మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు. శిక్షను ఖరారు చేసి జైలుకు పంపారు.
ఆమెకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా బైడెన్ సర్కా రు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఖైదీల పరస్పర విడుదలకు రష్యాతో బేరసారాలు కొనసాగించింది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అబుదాబిలో గ్రినర్ ను అప్పగించి, విక్టర్ బౌట్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇక అమెరికా బాస్కెట్ బాల్ సంచలనం.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన 31 ఏళ్ల బ్రిట్నీ గ్రైనర్ (Brittney Griner).. రష్యా ప్రీమియర్ లీగ్ కోసం గత ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లింది. అయితే లగేజీలో హషిష్ నూనె (hashish oil) దొరకడంతో రష్యా కస్టమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్స్ ఆరోపణలకుగానూ ఆమెకు తొమ్మిదేళ్ల శిక్ష విధించారు.
చదవండి: FIFA WC 2022: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్‌లోనే
Обнародованы видеокадры обмена россиянина Виктора Бута на американку Бриттни Грайнер:https://t.co/hs1cFtHbOs
— ТАСС (@tass_agency) December 8, 2022
Видео: ТАСС pic.twitter.com/UZ209BYPRX
Comments
Please login to add a commentAdd a comment