ఎన్‌బీఏ(బాస్కెట్‌బాల్) మాజీ ప్లేయర్ కాలేబ్ స్వానిగన్ 25 ఏళ్ల వయసులో మృత్యు ఒడిలోకి చేరాడు. అతని మరణ విషయాన్ని 'పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్' టీం తన ట్విటర్‌లో ప్రకటించింది. ''కాలేబ్ స్వానిగన్ అకాల మరణం పట్ల చింతిస్తున్నాం. ఆడింది కొద్దిరోజులే అయినా గొప్ప ఎన్‌బీఏ ప్లేయర్‌గా ఎదిగాడు. కాలేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అతని కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.'' అంటూ ట్వీట్ చేసింది. అయితే కాలెబ్ మరణ వార్తని మాత్రమే వెల్లడించిన 'పర్డ్యూ మెన్స్' మృతి వెనుక కారణాలను మాత్రం రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. అయితే అలెన్ కౌంటీ కార్నర్స్ అందించిన రిపోర్ట్స్ ప్రకారం కాలేబ్ స్వానిగన్‌ది సహజ మరణమే అని తెలిసింది. ఇక ఎన్‌బీఏ(నేషనల్ బాస్కెట్‌బాల్ అసొసియేషన్) అనేది నార్త్ అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ లీగ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
💔 Devastated.
— Purdue Mens Basketball (@BoilerBall) June 21, 2022
Our thoughts and prayers to Caleb Swanigan’s family and friends. The world lost a gentle soul last night.
Love you Biggie. pic.twitter.com/spU2hQtJdi
2017 నుంచి మూడేళ్ల పాటు ఎన్‌బీఏలో కొనసాగిన కాలేబ్ స్వానిగన్ పోర్ట్‌లాండ్ ట్రయల్‌బేజర్స్, సాక్రామెంటో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2019-20 సీజన్ నుంచి మాత్రం కాలేబ్ ఎన్‌బీఏలో యాక్టివ్‌గా లేడు. అంతకముందు ఫ్లొరిడాలో నిర్వహించిన కోవిడ్-19 బయోబబూల్ క్యాంప్‌కు వెళ్లేందుకు కాలేబ్ నిరాకరించడంతో అతనిపై వేటు పడింది. ఆ తర్వాత కాలేబ్ స్వానిగన్ కారులో గంజాయితో పట్టుబడి అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి మానసికంగా బాగాలేడనే వార్తలు వచ్చాయి. తాజాగా చిన్న వయసులోనే మరణించడం వెనుక డ్రగ్స్ కారణమని.. బరువు తగ్గేందుకే కాలేబ్ మాదకద్రవ్యాలను వినియోగించడంటూ ట్విటర్‌లో కొందరు పేర్కొన్నారు.
ఇక కాలేబ్ స్వానిగన్ స్కూల్ వయసులోనే బాస్కెట్‌బాల్‌లో సంచలనాలు నమోదు చేశాడు. 2015లో తన స్కూల్‌కు బాస్కెట్‌బాల్‌లో మెయిడెన్ స్టేట్ చాంపియన్‌షిప్‌గా నిలవడంతో కాలేబ్‌ది కీలకపాత్ర. ఈ ప్రదర్శనతో ఇండియానాలో ఫేమస్ అవార్డుగా చెప్పుకునే మిస్టర్ బాస్కెట్‌బాల్ గౌరవాన్ని కాలేబ్ అందుకున్నాడు. ఇక పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్ టీం తరపున ఎన్‌బీఏలో లెక్కలేనన్ని రికార్డులు అందుకున్నాడు.
చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే
Comments
Please login to add a commentAdd a comment