సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుర జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 61-45తో ఢిల్లీని ఓడించింది. తెలంగాణ తరఫున అశ్వని 15 పాయింట్లు, సౌరభ్ 11 పాయింట్లు స్కోరు చేశారు.
మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 62-21తో కేరళను చిత్తుగా ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున కేవీవీ రమణ 17 పాయింట్లు, షేక్ అహ్మద్ అలీషా 12 పాయింట్లు, శ్రీతమ్ త్రిపాఠి 10 పారుుంట్లు సాధించారు. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తమిళనాడుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 16-62తో ఓడిపోయింది. తెలంగాణ జట్టులో సంధ్య 10 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.