హైదరాబాద్‌ స్కై గెలుపు | hyderabad sky beats chennai slam in ubb basket ball | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ స్కై గెలుపు

Published Tue, Feb 28 2017 10:36 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

హైదరాబాద్‌ స్కై గెలుపు - Sakshi

హైదరాబాద్‌ స్కై గెలుపు

యూబీఏ బాస్కెట్‌బాల్‌ లీగ్‌  


చెన్నై: యూబీఏ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ స్కై జట్టు గెలుపొందింది. చెన్నై స్లామ్‌ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 83–79 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టెవిన్‌ కెల్లీ 37 పాయింట్లు సాధించి హైదరాబాద్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. మహేశ్‌ పద్మనాభన్‌ 17 పాయింట్లు, జోగిందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో రాణించారు. చెన్నై స్లామ్‌ జట్టులో రికిన్‌ 27 పాయింట్లతో పోరాడగా... రామ్‌ కుమార్‌ 21 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టెవిన్‌ కెల్లీకి ‘ ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కగా... జోగిందర్‌ సింగ్‌కు ‘ నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును గెలుచుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement