సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌సగా బరిలోకి దిగిన హైదరాబాద్ మహిళల, పురుషుల జట్లు ఆ హోదాకు తగ్గట్లుగా రాణించాయి. ఈసారి కూడా విజేతలుగా నిలిచి టైటిల్స్‌ను కై వసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 85-63తో కరీంనగర్ జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున ఇర్ఫాన్ (25), శివ కుమార్ (16), సచిన్ (16) ఆకట్టుకున్నారు. కరీంనగర్ జట్టులో అరుణ్ తేజ (25), సాయి కుమార్ (20) పోరాడారు.
మూడో స్థానం కోసం జరిగిన పోరులో రంగారెడ్డి జట్టు 70-53తో వరంగల్ జట్టుపై నెగ్గింది. మహిళల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 32-18తో రంగారెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టులో స్నేహ (8), రమ్య (7) రాణించారు. రంగారెడ్డి జట్టు తరఫున తేజశ్రీ (8), రచన (6) ఆకట్టుకున్నారు. మెదక్ జట్టు 27-13తో కరీంనగర్ జట్టుపై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
హైదరాబాద్ జట్లకే టైటిల్స్
Published Mon, Dec 26 2016 10:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement