సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడల్లో వివిధ వయోవిభాగాలకు చెందిన తెలంగాణ, ఏపీ రీజియన్ బాస్కెట్‌బాల్ జట్లు ముందంజ వేశాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచారుు. జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 38-26తో ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ రీజియన్‌పై గెలుపొందగా... సీనియర్ బాలికల విభాగంలో 22-15తో గుజరాత్ రీజియన్ జట్టును ఓడించింది.
సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 45-15తో నార్త్ పంజాబ్ జట్టుపై గెలుపొంది... జూనియర్ బాలుర విభాగంలో 17-28తో ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ రీజియన్ చేతిలో పరాజయం పాలైంది.
ఫుట్‌బాల్‌లో నిరాశ
ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ అథ్లెటిక్ మీట్‌లో భాగంగా గచ్చిబౌలిలోని ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలుగు జట్టుకు నిరాశ ఎదురైంది. జూనియర్ బాలుర విభాగంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 1-2 గోల్స్ తేడాతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రీజియన్ జట్టు చేతిలో ఓడిపోయింది.