
బాస్కెట్‌బాల్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: బ్రదర్ జగన్-బ్రదర్ రవి స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. సెయింట్ పాల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో బాలికల విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్... మెరిడియన్ స్కూల్‌పై గెలుపొందింది. బాలుర విభాగంలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్... ఎంజీఎంపై నెగ్గింది.
మరో మ్యాచ్‌లో ఆతిథ్య సెయింట్ పాల్ హైస్కూల్... సెయింట్ మార్టిన్స్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాంట్‌ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియెల్ (హైదరాబాద్ ప్రావిన్స్) కార్యదర్శి రెవరెండ్ బ్రదర్ లౌర్డ్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు.