Published
Sat, Aug 6 2016 6:20 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
విద్యార్థులకు బహుమతుల అందజేత
: తెలంగాణ కోసం అలుపెరుగని ఉద్యమాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థులకు దిశ, నిర్దేశమని టీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ సతీష్‌సింగ్, ఉపాధ్యక్షులు మిట్ట అనిల్‌గౌడ్ అన్నారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి శనివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ జీవిత చరిత్రపై పలు అంశాలను తెలియజేశారు. అంతకు ముందు జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆరుట్ల కిషోర్, ప్రభాకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు కర్రె నాగరాజు, కంసాని రాము, సిలగ అనిల్, మద్దూరి ప్రవీణ్, బొజ్జ భాను తదితరులున్నారు.