ఓవరాల్‌ చాంప్‌ ముసునూరు | overall champ musunuru | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంప్‌ ముసునూరు

Published Sat, Dec 3 2016 10:07 PM | Last Updated on Thu, Apr 4 2019 2:14 PM

ఓవరాల్‌ చాంప్‌ ముసునూరు - Sakshi

ఓవరాల్‌ చాంప్‌ ముసునూరు

ముసునూరు : నాలుగు రోజులుగా రసవత్తరంగా సాగిన ఎనిమిది జిల్లాల స్థాయి గురుకుల బాలికల క్రీడా పోటీల్లో కృష్ణాజిల్లా ముసునూరు ఓవరల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ముసునూరు, గుంటూరు జిల్లా కావూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరికి ముసునూరు జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఉదయం జరిగిన 800 మీటర్ల రిలే పోటీల సైతం ముసునూరు విజయం సాధించింది. పోటీగా నిలిచిన కావూరు రెండోస్థానాన్ని సరిపెట్టుకుంది. కబడ్డీ పోటీ కూడా ఉత్కంఠ మధ్య జరిగాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.సురేష్‌బాబు అధ్యక్షతన బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు గ్రహీత మూల్పురి లక్ష్మణస్వామి విజేతలకు బహుమతులతో పాటు నోట్‌ పుస్తకాలను అందజేశారు. నూజివీడుకు చెందిన వస్త్ర వ్యాపారి మిరియాల కృష్ణకిషోర్‌ దంపతులు విజేతలకు నూతన వస్త్రాలతోపాటు బాలికలందరికీ పౌచ్‌లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్, పిఈటీ బృందాన్ని సన్మానించారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొర్లకుంట సొసైటీ అధ్యక్షుడు మూల్పురి నాగమల్లేశ్వరరావు, ప్రాంతీయ ఉపకార్యదర్శి కె.భారతీదేవి, పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement