బృందగానంలో చిన్నారుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: భారత వికాస్ పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి బృందగాన పోటీల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు మున్నంగి హైస్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎన్జీవో కాలనీలోని పాఠశాలలో శనివారం విద్యార్థులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జానపద గేయ విభాగంలో ఎం.లక్ష్మీ హర్షిక, వై.హేమలత, డి.గౌరీ, ఎస్.జ్ఞానేశ్వరి, జి.సింధూరిరెడ్డి ద్వితీయ బహుమతి సాధించారని వివరించారు. ప్రిన్సిపాల్ సయ్యద్ మొహమ్మద్ గౌస్, ఇన్‌చార్జ్ జి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.