జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
Published Mon, Feb 13 2017 10:06 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్ విభాగంలో ఎం.చైతన్య, ఆర్.నరసింహ రవీంద్ర, ఎస్.సాయి గృహికేష్, ఎస్.బాలాజీరెడ్డి, అండర్ -15 బాలుర విభాగంలో సాయిసుహాస్, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement