ముగిసిన ఖేలో ఇండియా పోటీలు
కర్నూలు (టౌన్): ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. ఆరురోజులుగా స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజు అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్ క్రీడాంశాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీ పడ్డారు. వీటిలో గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్‌డీఓ మలి్లకారు్జన మెడల్స్ అందజేశారు.
విజేతల వివరాలు
అథ్లెటిక్స్ అండర్–14 బాలుర వంద మీటర్ల పరుగులో ఆదోనికి చెందిన సాగర్, కోడుమూరుకు చెందిన అజిత్‌కుమార్, రాము, 400 మీటర్ల పరుగు పందెంలో ఎమ్మిగనూరుకు చెందిన ఫరూక్, ఆళ్లగడ్డకు చెందిన అబూసిద్ధిక్, పాణ్యంకు చెందిన వీరసాయి, లాంగ్‌జంప్‌లో మంత్రాలయానికి చెందిన నరసింహులు, కోడుమూరుకు చెందిన అజిత్‌కుమార్, మంత్రాలయానికి చెందిన టి.రాజు , షాట్‌ఫుట్ విభాగంలో ఆళ్లగడ్డకు చెందిన హేమంత్, పత్తికొండకు చెందిన రవి, ఎం.రాజు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
అథ్లెటిక్స్ అండర్–14 బాలికల వంద మీటర్ల పరుగులో డోన్‌కు చెందిన రామలక్ష్మి, పాణ్యంకు చెందిన జి.ప్రియాంక, ఆళ్లగడ్డకు చెందిన డి.బెల్లి, 400 మీటర్ల పరుగులో పాణ్యంకు చెందిన మెహరూన్‌బీ, డోన్‌కు చెందిన డి.రేఖ, పత్తికొండకు చెందిన సి.మనీష, లాంగ్‌జంప్‌లో పత్తికొండకు చెందిన కె.రామలక్ష్మి, నందికొట్కూరుకు చెందిన టి.విజయరాణి, కోడుమూరుకు చెందిన బి.శిరీష, షాట్‌ఫుట్ విభాగంలో ఆలూరుకు చెందిన జి.సుజాత, బి.ఇందు, కోడుమూరుకు చెందిన కె.శోభ వరుసగా ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాలు సాధించారు.