జైట్లీ బడ్జెట్‌లో విన్నర్స్‌, లూజర్స్‌ వీరే! | Union Budget 2018: Winners and losers | Sakshi
Sakshi News home page

జైట్లీ బడ్జెట్‌లో విన్నర్స్‌, లూజర్స్‌ వీరే!

Published Thu, Feb 1 2018 4:18 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

Union Budget 2018: Winners and losers - Sakshi

న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్‌ 2018ను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు వరాల జల్లులు కురిపిస్తూ ఈ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు, ప్రైవేట్‌ పెట్టుబడుల వృద్ధికి కూడా జైట్లీ బడ్జెట్‌ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో విన్నర్లు ఎవరు.. లూజర్లు ఎవరో తెలుసుకుందాం.. 

విన్నర్లు...
వ్యవసాయదారులు : ఈ బడ్జెట్‌లో వ్యవసాయదారులే అతిపెద్ద విజేతలు. పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లపై భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నగదు, సోలార్‌ పంపుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఆదేశం వంటి వాటిని జైట్లీ ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయ ఆధారిత కంపెనీలు శక్తి పంప్స్‌ ఇండియా లిమిటెడ్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, కేఎస్‌బీ పంప్స్‌ లిమిటెడ్‌, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌, అవంతి ఫీడ్స్‌ లిమిటెడ్‌, వాటర్‌బేస్‌ లిమిటెడ్‌, జేకే అగ్రి జెనెటిక్స్‌ లిమిటెడ్‌, పీఎల్‌ ఇండస్ట్రీస్‌ లకు లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది.

ఆరోగ్య సంరక్షణదారులు...
కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ లాంటి కంపెనీలు ఎక్కువగా లబ్ది పొందనున్నాయి.

ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలు...
రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించనున్నట్టు జైట్లీ ప్రామిస్‌ చేశారు. ఈ వాగ్దానంతో నిర్మాణ, ఇంజనీరింగ్‌ సంస్థలకు, రైల్వే వాగన్‌ ప్రొడ్యూసర్లకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది.

కన్జ్యూమర్‌ కంపెనీలు...
హిందూస్తాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, మారికో లిమిటెడ్‌ వంటి కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీల్లో ఇక రోజువారీ కూలీలకు ఉద్యోగం లభించనుంది. హీరో మోటార్‌కార్ప్‌ లిమిటెడ్‌, ఎం అండ్‌ ఎం లిమిటెడ్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో లిమిటెడ్‌లకు లబ్ది చేకూరనుంది.
జువెల్లర్స్‌, ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థలు కూడా జైట్లీ బడ్జెట్‌లో విన్నర్లుగా ఉన్నాయి.

లూజర్లు..
ఆపిల్‌, శాంసంగ్‌ : మొబైల్ ఫోన్లపై బడ్జెట్‌లో కూడా కస్టమ్స్‌ డ్యూటీని పెంచడంతో, దిగ్గజ కంపెనీలు ఆపిల్‌, శాంసంగ్‌లకు గట్టి షాక్‌ ఎదురైంది. ఆపిల్‌ ఇంక్‌కు, శాంసంగ్‌ ఎల​క్ట్రానిక్స్‌ కంపెనీలు తక్కువ రిటర్నులు పొందే అవకాశం కనిపిస్తోంది. 

ఫైనాన్స్‌ సెక్టార్‌ : ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం ఎల్‌టీసీజీ పన్ను విధింపు నిర్ణయాన్ని ప్రకటించడంతో, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కంపెనీలు, లైఫ్‌ ఇన్సూరర్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్పత్తుల ప్రొవైడర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. 

రక్షణ రంగం : రక్షణ రంగానికి అంత పెద్ద మొత్తంలో బూస్టింగ్‌ను ఏమీ జైట్లీ ప్రకటించలేదు. దీంతో భారత్‌ ఫోర్స్‌ లిమిటెడ్‌ లాంటి రక్షణ రంగ కంపెనీలకు ప్రతికూలమే అని తెలుస్తోంది. 

కన్జూమర్స్‌ : ఆరోగ్యానికి సంబంధించిన ప్లాన్లు, లక్ష మంది పేద భారతీయులకు లబ్ది చేకూరనుంది. ఈ ప్లాన్ల కోసం విధించే హెల్త్‌, ఎడ్యుకేషన్‌ లెవీని 3 శాతం నుంచి 4 శాతం పెంచారు. ఈ లెవీ అన్ని ఉత్పత్తులకు, సర్వీసులకు అమలు చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement