loosers
-
వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇప్పడు ఆ నోటి దురుసు వ్యాఖ్యలే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన అమెరికా నౌకాదళ సైనికులను ఫ్రాన్స్‌లోని డబ్ల్యూడబ్ల్యూఐ స్మశానవాటికలో ఖననం చేశారు. ఆ సమాధులను చూడటానికి ట్రంప్ ఇష్టపడలేదని సమాచారం. అంతేకాక ‘ఓడిపోయిన వారు.. పిరికి పందలను నేను చూడనంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అట్లాంటిక్ పత్రిక గురువారం ఒక నివేదిక వెల్లడించింది. మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బెర్గ్ ఈ నివేదికను ప్రచురించారు. దాని ప్రకారం.. 2018 లో పారిస్ సమీపంలోని ఐస్నే-మార్న్ అమెరికన్ స్మశానవాటికను సందర్శించడానికి ట్రంప్ నిరాకరించారని, ఎందుకంటే ‘వర్షంలో తన జుట్టు చెడిపోతుందని ఆయన భయపడ్డాడు’ అని అధికారిక వివరణ. కానీ ట్రంప్ సహాయకులు మాత్రం వాతావరణం బాగాలేదని.. అందుకే హెలికాప్టర్ అక్కడికి వెళ్లలేదని తెలిపారు. సీనియర్ అధికారులతో మాట్లాడి తన పర్యటన వివరాలు తెలుసుకున్న ట్రంప్ ‘నేను ఎందుకు సశ్మాన వాటికను సందర్శించాలి. అక్కడ అంతా ఓడిపోయిన వారే ఉంటారు’ అని వ్యాఖ్యానించినట్లు ఆర్టికల్ పేర్కొన్నది. ఇదే పర్యటనకు సంబంధించి మరో సంభాషణలో ట్రంప్ చనిపోయిన 1,800 మంది నౌకాదళ వీరులను ఓడిపోయారు.. పిరికి వాళ్లు అని విమర్శించినట్లు ఆర్టికల్ వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని ట్రంప్ టీం ఖండించింది. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడు ఈ కథనాన్ని చదివి ఎంతో బాధపడ్డారు. తప్పడు వార్తలను తీవ్రంగా ఖండించారు’ అని తెలిపారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలిస్సా ఫరా ఈ ఆరోపణలు అభ్యంతరకరమైనవి.. చాలా తప్పుడువి అన్నారు. అంతేకాక ట్రంప్ ప్రచార ప్రతికా కార్యదర్శి హోగన్ గిడ్లీ మాట్లాడుతూ.. ‘నేను అప్పుడు అధ్యక్షుడితో పాటే ఉన్నాను. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇవి పూర్తిగా పచ్చి అబద్దాలు. పిరికిపంద వ్యాఖ్యలు. కనుకనే వారు పేర్లు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వారికి తెలుసు’ అంటూ గిడ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కొందరు విమర్శకులు మాత్రం ఈ కథనాన్ని సమర్థిస్తున్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు దివంగత సెనేటర్ జాన్ మెక్కెయిన్ గురించే చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. జాన్ వియాత్నంలో పట్టుబడ్డాడు. అతడిని యుద్ధ వీరుడిగా పరిగణిస్తారు. 2016 ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘జాన్ యుద్ధ వీరుడు కాదు. పట్టుబడ్డ వ్యక్తిని యుద్ధవీరుడు అనకూడదు. శత్రువుకు చిక్కని వారినే నేను ఇష్టపడతాను’ అంటూ వ్యాఖ్యానించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో1918 లో పారిస్ వైపు జర్మన్ పురోగతిని నిలిపివేసి, బెల్లీ వుడ్ వద్ద జరిగిన యుద్ధంలో సుమారు 1,800 అమెరికా నౌకాదళ సైనికులు మరణించారు. అట్లాంటిక్ ప్రకారం, ట్రంప్ తన ఫ్రాన్స్ పర్యటనలో ‘ఈ యుద్ధంలో మంచి వ్యక్తులు ఎవరు.. అసలు యునైటెడ్ స్టేట్స్ మిత్రరాజ్యాల సహాయానికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు’ అని తన సహాయకులతో వ్యాఖ్యానించినట్లు తెలిస్తోంది. -
జైట్లీ బడ్జెట్లో విన్నర్స్, లూజర్స్ వీరే!
న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్ 2018ను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు వరాల జల్లులు కురిపిస్తూ ఈ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి కూడా జైట్లీ బడ్జెట్ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో విన్నర్లు ఎవరు.. లూజర్లు ఎవరో తెలుసుకుందాం.. విన్నర్లు... వ్యవసాయదారులు : ఈ బడ్జెట్లో వ్యవసాయదారులే అతిపెద్ద విజేతలు. పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లపై భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నగదు, సోలార్ పంపుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఆదేశం వంటి వాటిని జైట్లీ ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయ ఆధారిత కంపెనీలు శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, కేఎస్బీ పంప్స్ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్, వాటర్‌బేస్ లిమిటెడ్, జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, పీఎల్ ఇండస్ట్రీస్ లకు లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణదారులు... కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఎక్కువగా లబ్ది పొందనున్నాయి. ట్రాన్స్పోర్ట్ కంపెనీలు... రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించనున్నట్టు జైట్లీ ప్రామిస్ చేశారు. ఈ వాగ్దానంతో నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థలకు, రైల్వే వాగన్ ప్రొడ్యూసర్లకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. కన్జ్యూమర్ కంపెనీలు... హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, మారికో లిమిటెడ్ వంటి కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో ఇక రోజువారీ కూలీలకు ఉద్యోగం లభించనుంది. హీరో మోటార్‌కార్ప్ లిమిటెడ్, ఎం అండ్ ఎం లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్‌లకు లబ్ది చేకూరనుంది. జువెల్లర్స్, ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థలు కూడా జైట్లీ బడ్జెట్లో విన్నర్లుగా ఉన్నాయి. లూజర్లు.. ఆపిల్, శాంసంగ్ : మొబైల్ ఫోన్లపై బడ్జెట్లో కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో, దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్‌లకు గట్టి షాక్ ఎదురైంది. ఆపిల్ ఇంక్‌కు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తక్కువ రిటర్నులు పొందే అవకాశం కనిపిస్తోంది. ఫైనాన్స్ సెక్టార్ : ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం ఎల్టీసీజీ పన్ను విధింపు నిర్ణయాన్ని ప్రకటించడంతో, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉత్పత్తుల ప్రొవైడర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. రక్షణ రంగం : రక్షణ రంగానికి అంత పెద్ద మొత్తంలో బూస్టింగ్‌ను ఏమీ జైట్లీ ప్రకటించలేదు. దీంతో భారత్ ఫోర్స్ లిమిటెడ్ లాంటి రక్షణ రంగ కంపెనీలకు ప్రతికూలమే అని తెలుస్తోంది. కన్జూమర్స్ : ఆరోగ్యానికి సంబంధించిన ప్లాన్లు, లక్ష మంది పేద భారతీయులకు లబ్ది చేకూరనుంది. ఈ ప్లాన్ల కోసం విధించే హెల్త్, ఎడ్యుకేషన్ లెవీని 3 శాతం నుంచి 4 శాతం పెంచారు. ఈ లెవీ అన్ని ఉత్పత్తులకు, సర్వీసులకు అమలు చేయనున్నారు. -
గెలిచినోళ్లకే కండువా, ఓడినోళ్లకు కాదు...!
అధికార పార్టీ గెలిచినోళ్లకే కండువా వేస్తుంది కాని ఓడినోళ్లకు కాదని ఒక నేతకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందట. హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తెగ హడావుడి చేసే ఈ నేత పార్టీని ఫిరాయించడం దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా జరగడం... సొంతపార్టీలోనే సదరు నేత కొనసాగాల్సి రావడంతో... అసలు కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీశారట అనుచరులు. అధికారపార్టీలోకి చేరేందుకు ఈ నేత రాజ్యసభ సీటు కావాలని లేదా హెచ్ఎండీఏ చైర్మన్‌గా నియమించాలని, హైదరాబాద్ మేయర్ పదవి లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కండిషన్లు పెట్టారట. ఈ చిట్టానంతా విన్న అధికారపార్టీ నేతలు నీకంత సీన్ లేదు, బేషరతుగా వస్తే రా లేకపోతే లేదు అని మొహమాటం లేకుండా చెప్పారట. పార్టీలో చేరిక కార్యక్రమానికి అగ్రనేత రారని, ఎవరైనా మంత్రి సమక్షంలోనే చేరాలని కూడా తమ వంతు కండిషన్లు చెప్పేశారట. అంతేకాకుండా నగరంలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి ఉంటుందంటూ తేల్చేశారట. దీనితో ఆ పార్టీలో చేరి అనామకుడిగా ఎందుకు మిగిలిపోవాలంటూ ఉన్నపార్టీలోనే కొనసాగాలని ఈ నేత డిసైడ్ అయ్యారట. అయితే సదరునేత ఉన్నపార్టీలోనే ఉంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శల్యసారధ్యం చేసి, గెలిచిన కొందరు కార్పొరేటర్లను తీసుకుని అధికారపార్టీలో ఎక్కడ చేరతాడోనన్న అనుమానం పార్టీనేతలను పెనుభూతంగా భయపెడుతోందట. ఈ నేతను వదిలించుకునేందుకు ఏమి చేయాలా అని కంటి మీద కునుకులేకుండా సొంతపార్టీనేతలు ఆలోచిస్తున్నారట...