సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచగా, పేదప్రజలకు భారీ ఊరట కల్పించారు. అలాగే 10కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంపుతో ఇక స్మార్ట్‌ఫోన్ల దిగుమతులకు అసాధ్యమనే స్థితికి చేరామని ఐసీఏ అధ్యక్షుడు పంకజ్ మహాంద్రో వ్యాఖ్యానించారు.
టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు తప్పదు.. పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2018 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఎక్సైజు, కస్టమ్స్ సుంకాల్లో మార్పులను ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రకారం మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 15 నుంచి 20 శాతానికి పెరిగింది. విద్యా సెస్ 3శాతం నుండి 4శాతం వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తగ్గేవి ఒకసారి చూద్దాం.
ధరలు పెరిగే ఉత్పత్తులు/ సేవల జాబితా
* కార్లు, మోటార్ సైకిళ్ళు
* మొబైల్ ఫోన్లు
* వెండి
* బంగారం
* సన్ స్క్రీన్
* పాదరక్షలు
* కూరగాయలు పండ్ల రసాలు
* సన్ గ్లాసెస్
* సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు
* పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్
* రంగు రత్నాలు
* వజ్రాలు
* ఇమిటేషన్ జ్యుయల్లరీ
* స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు
*ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్లు
* దంత ఉత్పత్తులు,
* సిల్క్ ఫాబ్రిక్స్
* ఫర్నిచర్
* పరుపులు
* లాంప్స్
* అన్ని రకాల గడియారాలు
* ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు,
* వీడియో గేమ్ కన్సోల్లు
* స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు, స్విమ్మింగ్ పూల్ సామగ్రి
* సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు
* కైట్స్
* వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు
ధర తగ్గే ఉత్పత్తులు / సేవల జాబితా
* జీడిపప్పు
* ముడి పదార్థాలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు , ఉపకరణాలు
* సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు
* కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ ఉత్పతులు,
Comments
Please login to add a commentAdd a comment