losers
-
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
2018 బడ్జెట్ : పెరిగేవి, తగ్గేవి
సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచగా, పేదప్రజలకు భారీ ఊరట కల్పించారు. అలాగే 10కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంపుతో ఇక స్మార్ట్ఫోన్ల దిగుమతులకు అసాధ్యమనే స్థితికి చేరామని ఐసీఏ అధ్యక్షుడు పంకజ్ మహాంద్రో వ్యాఖ్యానించారు. టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు తప్పదు.. పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2018 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఎక్సైజు, కస్టమ్స్ సుంకాల్లో మార్పులను ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రకారం మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 15 నుంచి 20 శాతానికి పెరిగింది. విద్యా సెస్ 3శాతం నుండి 4శాతం వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తగ్గేవి ఒకసారి చూద్దాం. ధరలు పెరిగే ఉత్పత్తులు/ సేవల జాబితా * కార్లు, మోటార్ సైకిళ్ళు * మొబైల్ ఫోన్లు * వెండి * బంగారం * సన్ స్క్రీన్ * పాదరక్షలు * కూరగాయలు పండ్ల రసాలు * సన్ గ్లాసెస్ * సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు * పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్ * రంగు రత్నాలు * వజ్రాలు * ఇమిటేషన్ జ్యుయల్లరీ * స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు *ఎల్సీడీ/ఎల్ఈడీ టీవీ ప్యానెల్లు * దంత ఉత్పత్తులు, * సిల్క్ ఫాబ్రిక్స్ * ఫర్నిచర్ * పరుపులు * లాంప్స్ * అన్ని రకాల గడియారాలు * ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు, * వీడియో గేమ్ కన్సోల్లు * స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు, స్విమ్మింగ్ పూల్ సామగ్రి * సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు * కైట్స్ * వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు ధర తగ్గే ఉత్పత్తులు / సేవల జాబితా * జీడిపప్పు * ముడి పదార్థాలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు , ఉపకరణాలు * సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు * కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ ఉత్పతులు, -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ ఖానాపురం : జిల్లా వ్యాప్తంగా వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రధాన సరస్సులలో ఒకటైన పాకాల శనివారం సా యంత్రం మత్తడి పడటంతో ఆదివారం కట్టమైసమ్మ, మత్తడి ప్రదేశాల్లో ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వర్షాలతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ భా గం మొక్కజొన్నతో పాటు వరి, ఇతర పంట లు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలపై గ్రామాల వారీగా సర్వేలు నిర్వహించాలన్నారు. వైఎస్సార్ హయాంలో భారీ వర్షాలు పడగా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవడం జరిగిందన్నారు. నర్సం పేట మండల అధ్యక్షుడు నూనె నర్సయ్య, యువజన నాయకుడు బూర సుమ¯ŒSగౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శీలం రవి, జిల్లా కార్యదర్శి సుదర్శ¯ŒS, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అశోక్, పాల్గొన్నారు. -
ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 55 శివసేన - 29 కాంగ్రెస్ - 25 ఎన్సీపీ - 21 ఇతరులు - 17 గెలుపొందినవారు: అజిత్ పవర్ (ఎన్సీపీ) వైభవ్ నాయక్ (శివసేన) దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) ఓడిపోయినవారు: నారాయణ రాణె (కాంగ్రెస్) హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 45 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ - 19 హెచ్జేసీ - 2 ఇతరులు - 6 విజయం సాధించినవారు: భూపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్) -
ఆస్కార్ బరిలో ఓడిపోతే.. 34 లక్షలు!!
ఆస్కార్ అవార్డు దక్కడం అంటే చాలా పెద్ద గౌరవం. కానీ, అక్కడి వరకు వెళ్లి ఓడిపోయిన వారు కూడా నిరాశ చెందకుండా వాళ్ల కోసం ఓ బహుమతిని నిర్వాహకులు సిద్ధం చేశారు. అలాంటివాళ్లు ఖాళీ చేతులతో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేశారు. ఓడిపోయామన్న బాధను వారి గుండెల్లోంచి ఎంతో కొంత తీసేయడానికని ఆస్కార్ రన్నరప్‌గా నిలిచినవారు 55వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 34 లక్షలు) గిఫ్ట్ బ్యాగ్‌లు అందిస్తారు. వీటిలో వైన్, చాక్లెట్ ఫ్లైట్ పెయిరింగ్, స్విస్ తయారీ స్లో వాచ్, జాన్ లూయీస్ డిజైన్స్ గాజులు, కెనడియన్ రాకీస్, మెక్సికో, జపాన్ దేశాలకు లగ్జరీ ప్యాకేజిలు, స్పా ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల బహుమతులు అందులో కలగలిసి ఉంటాయి. వీటన్నింటినీ ఆస్కార్ ఆతిథ్య సంస్థ అందిస్తుంది. 86వ ఆస్కార్ అవార్డుల పండుగ మార్చి 2వ తేదీన జరగనుంది.