- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Published Sun, Sep 25 2016 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ఖానాపురం : జిల్లా వ్యాప్తంగా వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రధాన సరస్సులలో ఒకటైన పాకాల శనివారం సా యంత్రం మత్తడి పడటంతో ఆదివారం కట్టమైసమ్మ, మత్తడి ప్రదేశాల్లో ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వర్షాలతో జిల్లావ్యాప్తంగా ఎక్కువ భా గం మొక్కజొన్నతో పాటు వరి, ఇతర పంట లు దెబ్బతిన్నాయన్నారు. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలపై గ్రామాల వారీగా సర్వేలు నిర్వహించాలన్నారు. వైఎస్సార్ హయాంలో భారీ వర్షాలు పడగా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవడం జరిగిందన్నారు. నర్సం పేట మండల అధ్యక్షుడు నూనె నర్సయ్య, యువజన నాయకుడు బూర సుమ¯ŒSగౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శీలం రవి, జిల్లా కార్యదర్శి సుదర్శ¯ŒS, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అశోక్, పాల్గొన్నారు.
Advertisement
Advertisement