ఆస్కార్ బరిలో ఓడిపోతే.. 34 లక్షలు!! | Losers at the Oscars to get USD 55,000 gift bags | Sakshi
Sakshi News home page

ఆస్కార్ బరిలో ఓడిపోతే.. 34 లక్షలు!!

Published Fri, Feb 14 2014 4:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

Losers at the Oscars to get USD 55,000 gift bags

ఆస్కార్ అవార్డు దక్కడం అంటే చాలా పెద్ద గౌరవం. కానీ, అక్కడి వరకు వెళ్లి ఓడిపోయిన వారు కూడా నిరాశ చెందకుండా వాళ్ల కోసం ఓ బహుమతిని నిర్వాహకులు సిద్ధం చేశారు. అలాంటివాళ్లు ఖాళీ చేతులతో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే బాగుంటుందని ఈ ఆలోచన చేశారు. ఓడిపోయామన్న బాధను వారి గుండెల్లోంచి ఎంతో కొంత తీసేయడానికని ఆస్కార్ రన్నరప్గా నిలిచినవారు 55వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు 34 లక్షలు) గిఫ్ట్ బ్యాగ్లు అందిస్తారు.

వీటిలో వైన్, చాక్లెట్ ఫ్లైట్ పెయిరింగ్, స్విస్ తయారీ స్లో వాచ్, జాన్ లూయీస్ డిజైన్స్ గాజులు, కెనడియన్ రాకీస్, మెక్సికో, జపాన్ దేశాలకు లగ్జరీ ప్యాకేజిలు, స్పా ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల బహుమతులు అందులో కలగలిసి ఉంటాయి. వీటన్నింటినీ ఆస్కార్ ఆతిథ్య సంస్థ అందిస్తుంది. 86వ ఆస్కార్ అవార్డుల పండుగ మార్చి 2వ తేదీన జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement