విజేతలు
విజేతలు
Published Thu, Aug 11 2016 11:33 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
పెదగంట్యాడ: సందేశాలు, సందేహాలు యువతకు అందరూ ఇచ్చే టార్గెట్‌లు. ఒక టార్గెట్‌ను నిర్దేశించుకుని దానివైపే మిస్సైల్‌లా దూసుకుపోవాలని పెద్దలు ఇచ్చే సలహా. టార్గెట్ డాక్టర్, ఇంజినీర్ మాత్రమే కాదని ఆ రెండు దాటుకుని బయటికి వస్తే సమాజంలో ఎదగడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. అటువంటి విజయమార్గాలను ఎంచుకున్నారు వీరంతా...
అబ్రకదబ్రలో దిట్ట బీఎస్‌రెడ్డి
నగరానికి చెందిన ప్రముఖ మెజీషియన్ బిఎస్. రెడ్డి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. 25 సంవత్సరాలుగా మ్యాజిక్ షోస్ చేస్తూ ఇప్పటికి దేశ విదేశాల్లో మొత్తం 6500 ప్రదర్శనలు ఇచ్చారు. భ్రమ కల్పించడంలో ఆయన దిట్ట. సముద్ర తీరంలో ఎలాంటి ప్రాపర్టీస్ లేకుండా మనుషుల్ని గాలిలోకి లేపడంలో స్పెషలిస్ట్. అవార్డులు రివార్డులతో పాటు గౌరవ డాక్టరేట్‌ను పొందాడు. 2008లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఢిల్లీకి ఆహ్వానించారు. స్టీల్‌ప్లాంట్ గంగవరం పోర్టు తదితర కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు.ప్రపంచస్థాయి స్టార్ మెజీషియన్ కావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాడు.
‘యో వైజాగ్’ సష్టికర్త శిల్ప
వైజాగ్లో అందరికీ తెలిసిన ఇంగ్లీష్ మ్యాగజైన్ యో వైజాగ్... గత ఆరేళ్లుగా ఈ మేగజైన్ నడిపిస్తున్న శిల్ప చాలా తక్కువ మందికి తెలుసు. మార్కెటింగ్ రంగంలో చాలా అనుభవం ఉన్న ఈ యంగ్ లేడీ కొత్తగా వైజాగ్‌లో ఏదైనా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉద్యోగం మానేసి వైజాగ్ వచ్చి తమ్ముడితో కలిసి యో వైజాగ్ ఇంగ్లీష్ మ్యాగజైన్‌ను మొదలు పెట్టింది. కవర్‌పేజీ కోసం స్టార్ల వెంటపడి మొత్తానికి అనుకున్నది సాధించారు. తనకు తెలిసిన మార్కెటింగ్ స్కిల్స్‌తో మ్యాగజైన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. పలువురికి ఉపాధి కల్పించారు. ఈ మ్యాగజైన్‌లో పని చేసిన వాళ్లు పెద్ద ఇంగ్లీష్ పేపర్‌లకు రిపోర్టర్లుగా ఉద్యోగాలు సంపాదించారు.
ఐటీ హబ్‌లో అరుణ్ సత్తా
వరుణ్ బీటెక్ చదువుతూనే ఐటీ హబ్‌లో తన ప్రాజెక్ట్‌ను ఒకే చేయించుకుని డెస్క్ సంపాదించాడు. గవర్నమెంట్ నుంచి అన్‌లిమిటెడ్ ఇంటర్‌నెట్, కంప్యూటర్స్ ఇచ్చారు. తన దగ్గర కొంత మంది స్టూడెంట్స్ పని చేస్తున్నారు. నరేశ్ అనే యువకుడు మురళీనగర్‌లో జనరేషన్ యువ ఫౌండేషన్ ద్వారా చాలా మంది రోడ్ సైడ్ పిల్లల్ని చేరదీసి వారికి ప్రయివేటు స్కూల్స్‌లో చదువు చెప్పిస్తున్నాడు. దాదాపు 60 మంది పిల్లలు ఆయన సంరక్షణలో ఉన్నారు. ట్రాఫిక్‌లో అడుక్కునే పిల్లలను పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించి దానిని సాధించారు.
Advertisement