
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బెల్జియం గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 ని.34.476 సెకన్లలో పూర్తి చేశాడు. అతనికంటే 11.061 సెకన్లు ఆలస్యమైన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్‌లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్‌బర్గ్‌పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment