భార్యతో రేవంత్‌ వీడియోకాల్‌, కూతుర్ని చూసి భావోద్వేగం | Bigg Boss Telugu 6: Revanth Gets Emotional While Watching His Daughter | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: భార్యాబిడ్డను చూసి రేవంత్‌ ఎమోషనల్‌, తన ఇంటి మహాలక్ష్మి కోసం పాట..

Published Sat, Dec 3 2022 5:42 PM | Last Updated on Sat, Dec 3 2022 6:50 PM

Bigg Boss Telugu 6: Revanth Gets Emotional While Watching His Daughter - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, సింగర్‌ రేవంత్‌ తండ్రైన విషయం తెలిసిందే! అతడి భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను బిగ్‌బాస్‌ రేవంత్‌కు చేరవేయడంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక నాగార్జున ఏకంగా అన్వితతో వీడియో కాల్‌ మాట్లాడించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఇంటి మహాలక్ష్మిని చూసి ఎమోషనలయ్యాడు రేవంత్‌.

ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని కొంత బాధపడ్డాడు. తన ఇంటి మహాలక్ష్మి, జూనియర్‌ రేవంత్‌ కోసం అద్భుతమైన పాట పాడాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేవంత్‌ పాట పాడుతుంటే మా కళ్లలో నీళ్లు వచ్చేశాయి, రేవంత్‌ పాపను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: టికెట్‌ టు ఫినాలే గెలిచిన ఒకే ఒక్కడు విన్నర్‌గా.. మరి శ్రీహాన్‌కు సాధ్యమేనా?
మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి: అడివి శేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement