Bigg Boss 6 Telugu Promo: Srihan Emotional 100 Days Journey In The BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సేఫ్‌ ప్లేయర్‌ అన్నవారికి ఆటతో సమాధానం చెప్పారు

Published Wed, Dec 14 2022 3:39 PM | Last Updated on Wed, Dec 14 2022 3:57 PM

Bigg Boss Telugu 6: Srihan Look Back at His 100 Days Journey in the BB House - Sakshi

ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపుకు అడుగు దూరంలో ఉన్నారు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు. ఇప్పటికే రేవంత్‌, శ్రీసత్య, రోహిత్‌, ఆదిరెడ్డి వారి వంద రోజుల జర్నీని చూసి గుండె నిండా సంతోషాన్ని నింపుకున్నారు. ఈరోజు శ్రీహాన్‌, కీర్తిల వంతు వచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్‌ గురించి బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్‌ తన స్నేహితుల కోసం తగ్గారు.

ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్‌ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్‌ ప్లేయర్‌ అనిపించినా మీ ఆటతో సమాధానం చెప్పారు. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు బిగ్‌బాస్‌ విన్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్‌ కోరుకుంటున్నాడు అంటూ బిగ్‌బాస్‌ అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. తన గురించి బిగ్‌బాస్‌ అంత గొప్పగా మాట్లాడేసరికి శ్రీహాన్‌కు కన్నీళ్లు ఆగలేవు.

చదవండి: రోహిత్‌ జర్నీ హైలైట్‌, రుణపడి ఉంటానన్న ఆదిరెడ్డి
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement