టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. కానీ వ్యక్తిత్వంలో మాత్రం అతడు ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. మిగతావాళ్లను చులకన చేయడం, తనే తోపునని ఫీలవడం, టాస్కుల్లో ఫిజికల్ అవడం, ఓటమిని జీర్ణించుకోలేని తత్వం.. ఇలా చాలా మైనస్‌లే ఉన్నాయి. కానీ షో మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నాడు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందరితో గొడవలు పడతాడు, మళ్లీ కాసేపటికే సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్‌లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే రేవంత్ కప్పు కొట్టేలా ఉన్నాడు. ఈ క్రమంలో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'నా భర్త పేరు శంకర. నాకు మొదట కొడుకు పుట్టాడు. తర్వాత రేవంత్ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు. మా ఆయన లేకపోయినా బంగారంలాంటి పిల్లల్నిచ్చారని ఎప్పుడూ తలుచుకుంటాను. భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచానంటే అది నా ఫ్యామిలీ వల్లే.. మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు.. నన్ను, నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్లు అండగా లేకపోతే నేను రోడ్డున పడేదాన్ని.
రేవంత్ పుట్టాక నీకు నాన్న లేడని చెప్తే ఎక్కడ మనసులో పెట్టుకుంటాడోనని నిజం దాచాను. మీ నాన్న దుబాయ్‌లో ఉంటారు.. నిదానంగా వస్తారులే అని చెప్పేవాళ్లం. వాడిని చూస్తే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. భగవంతుడు ఎందుకా లోటు మిగిల్చాడని ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్‌కు నా లక్షణాలే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి కోపం కాసేపే ఉంటుంది. తర్వాత మామూలైపోయి సారీ చెప్తాడు' అని చెప్పుకొచ్చింది రేవంత్ తల్లి.
చదవండి: కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్‌మేట్స్, ఝలక్ ఇవ్వనున్న బిగ్‌బాస్
Comments
Please login to add a commentAdd a comment