Bigg Boss 6 Telugu: Singer Revanth Satires on Shrihan - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: శ్రీహాన్‌​ నా గురించి వెనకాల మాట్లాడతాడన్న రేవంత్‌, ఇరికించిన నాగ్‌

Published Sat, Dec 10 2022 5:51 PM | Last Updated on Sat, Dec 10 2022 7:42 PM

Bigg Boss 6 Telugu: Singer Revanth Satires on Shrihan - Sakshi

దెయ్యాలను చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లను చూసి మేము బాగా నవ్వుకున్నామన్నాడు నాగార్జున. ఈ సీజన్‌లోనే మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ వీడియో అంటూ దెయ్యం టాస్కులో కంటెస్టెంట్లు ఏ రేంజ్‌లో భయపడ్డారో మరోసారి చూపించాడు. తర్వాత అవతలి వాళ్లకంటే నేనే ఎందుకు బెస్ట్‌, నాకే ఎందుకు ఓట్లు వేయాలో చెప్పమంటూ ఓ టాస్క్‌ ఇచ్చాడు. అప్పుడే ఫిట్టింగ్‌ పెట్టేశారంటూ గొణుక్కున్నాడు రేవంత్‌.

రేవంత్‌ కన్నా నువ్వెందుకు బెటర్‌? నీకెందుకు ఓట్లేయాలో చెప్పు అని శ్రీహాన్‌ను ఆదేశించాడు నాగ్‌. దీనికతడు లేచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు. కానీ దాన్ని ఒప్పుకోగలగాలి. ఆ గుణం రేవంత్‌కు లేదు అన్నాడు. అంతలోనే ఇంకో విషయం గుర్తురావడంతో చెప్పొచ్చా? అని పర్మిషన్‌ అడిగాడు. రేవంత్‌ ఫ్లిప్పర్‌, నేను కాదంటావు, అంతేనా.. అని నాగ్‌ గెస్‌ చేయగా ఛఛ, అది కాదన్నాడు శ్రీహాన్‌.

మొన్న ఆదిరెడ్డితో అదే అన్నావుగా అని నాగ్‌ అనగా అలా అనలేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రేవంత్‌ కలగజేసుకుంటూ శ్రీహాన్‌ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు అంటూ ఉక్రోషానికి లోనయ్యాడు. ఈ మాటతో శ్రీహాన్‌ ఒక్కసారిగా షాకయ్యాడు. శ్రీహాన్‌ ఫ్లిప్పర్‌ అనే పదం వాడాడా? లేదా? అని ఆదిరెడ్డిని అడగ్గా అతడు తనకు గుర్తు లేదని బదులిచ్చాడు. దీంతో నాగ్‌.. నిన్ను మించిన ఫ్లిప్పర్‌ లేడులే అంటూ ఉడాల్‌ మామపై సెటైర్‌ వేశాడు.

చదవండి: ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్‌ అయిందా?
సీనియర్‌ నటి దారుణ హత్య, కన్న కొడుకే కొట్టి చంపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement