Bigg Boss: చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి! | Bigg Boss Telugu 6: Inaya Is The Last Captain Of BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఎట్టకేలకు కెప్టెన్‌గా అవతరించిన ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి!

Published Fri, Nov 25 2022 6:35 PM | Last Updated on Fri, Nov 25 2022 7:31 PM

Bigg Boss Telugu 6: Inaya Is The Last Captain Of BB House - Sakshi

ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంట్రీతో హౌస్‌మేట్స్‌ గాల్లో తేలిపోతున్నారు. కళ్లనిండా వారిని చూసుకుని మనసు నిండా వారి జ్ఞాపకాలు పదిలంగా దాచుకుని అయినవాళ్లకు భారంగా వీడ్కోలు పలుకుతున్నారు ఇంటిసభ్యులు. మరో మూడు, నాలుగు వారాల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తామంటూ కళ్లతోనే సంభాషిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్‌లో చివరగా రేవంత్‌ తల్లి వచ్చి వెళ్లిపోవడంతో ఫ్యామిలీ వీక్‌ ముగియనుంది.

ఇక హౌస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ జరగనుంది. ఇందులో భాగంగా ఒక రౌండ్‌ చుట్టూరా ఇంటిసభ్యులు నిలబడి బజర్‌ మోగినప్పుడు మధ్యలో ఉన్న బంతిని అందుకోవాలి. మళ్లీ బజర్‌ మోగే సమయానికి ఎవరి చేతిలో అయితే బంతి ఉంటుందో వారు ఇద్దరిని ఆటలో నుంచి తొలగించవచ్చు. ఈ గేమ్‌లో ఇనయ పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు కెప్టెన్‌ అవ్వాలన్న ఆమె కల నెరవేరిందని సంతోషపడుతున్నారు. ఈ దెబ్బతో ఇనయ ఏకంగా సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించుకుంది.

చదవండి: శ్రీసత్య ఎలిమినేషన్‌ కోసం ఎదురుచూస్తున్న హమీదా
న్యూజిలాండ్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement