Bigg Boss: అందువల్లే మెరీనా ఎలిమినేట్‌ అయిందా! | Bigg Boss Telugu 6: Reasons For Marina Abraham Sahni Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: మదర్‌ ఇండియా ఎలిమినేషన్‌కు కారణాలివే!

Published Sun, Nov 20 2022 10:17 PM | Last Updated on Mon, Nov 21 2022 9:12 PM

Bigg Boss Telugu 6: Reasons For Marina Abraham Sahni Elimination - Sakshi

రియాలిటీ షోను రక్తికట్టించేందుకు నానాతంటాలు పడుతున్నాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగానే గేట్లు ఎత్తడం, ఊహించని కంటెస్టెంట్లను ఎలిమినేట్‌ చేయడం, ప్రైజ్‌మనీ తగ్గించడం.. ఇలా చాలా స్టంట్లే చేస్తున్నాడు. బిగ్‌బాస్‌ షో 11 వారం ముగింపుకు వచ్చింది. ఈసారి మెరీనా ఎలిమినేట్‌ అయింది. ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో చూద్దాం..

మెరీనా తన భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో అడుగుపెట్టింది. మొదట్లో వీరిద్దరినీ ఒకే కంటెస్టెంట్‌గా పరిగణించారు. తర్వాత మాత్రం ఇద్దరినీ విడదీసి ఎవరి ఆట వాళ్లను ఆడమన్నారు. కానీ గేమ్‌లో ఒకరిని ఒకరు సపోర్ట్‌ చేసుకోవడం మిగతావాళ్లకు నచ్చలేదు. విడిగా ఆడమన్నా కలిసే ఆడుతున్నారంటూ పదేపదే దెప్పి పొడిచారు. చివరికి విడిగా ఆడారు కానీ అప్పటికే సమయం మించిపోయింది. రోహిత్‌ తన మాటలతో ఆటతో తనను తాను ప్రూవ్‌ చేసుకుంటూ రోజురోజుకీ ఫ్యాన్‌ బేస్‌ పెంచుకుంటున్నాడు.

మెరీనా మాత్రం మదర్‌ ఇండియాలా అందరికీ వంట చేసి పెడుతూ, నవ్వుతూ పలకరిస్తూ స్నేహంగా మెదిలింది. పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. కానీ అదే ఆమెకు మైనస్‌గా మారింది. బిగ్‌బాస్‌ హౌస్‌ అన్నాక యాక్టివ్‌గా ఉండాలి, గొడవలు పడాలి, టాస్కులు ఆడాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈ నాలుగింటిలో ఆమె వెనుకబడింది. అలాంటివారు షో రేటింగ్స్‌కు ఏమాత్రం ఉపయోగపడరు. దీంతో బిగ్‌బాస్‌ వీరిని ఏ క్షణంలోనైనా తీసేయొచ్చు.

పైగా ఇప్పుడు హౌస్‌లో పది మంది మాత్రమే మిగిలారు. ఉన్నవాళ్లలో ఆటలో వెనుకబడింది ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క మెరీనా మాత్రమే! ఇంకా చెప్పాలంటే రోహిత్‌, మెరీనాకు ఒకటే ఫ్యాన్‌బేస్‌ ఉంది. ఇద్దరూ నామినేషన్‌లో ఉన్నప్పుడు రోహిత్‌ను హౌస్‌లో ఉంచేందుకు అతడికి ఎక్కువ ఓట్లు గుద్దడంతో మెరీనాకు తక్కువ పడ్డాయి. ఫలితంగా ఈవారం మెరీనా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

చదవండి: బయటకు వచ్చాక గీతూ తల్లికి ఫోన్‌ చేశా
సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్‌ హత్యపై బయోపిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement