బిగ్ బాస్ తెలుగు -6 సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో సింగర్ రేవంత్ విన్నర్‌గా నిలవగా.. శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నిరాశకు గురిచేసంది. మరి ఎందుకిలా జరిగింది. నాగార్జున హోస్ట్ చేసిన కూడా ఈ సీజన్ నిరాశపరిచేందుకు గల కారణాలేవో ఓ సారి చూద్దాం.
టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్- 6 'ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్‌లైన్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ తమ ఎత్తులు, పైఎత్తులతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో కంటే ఈ సీజన్ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇటీవల కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది ప్రతివాదులు సీజన్‌ను 'ఫ్లాప్' అని పిలుస్తున్నారు.
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం: సెప్టెంబర్ 4న జరిగిన గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ రేటింగ్స్‌లో తెలుగులో రియాలిటీ టీవీ సిరీస్ గత సీజన్ల కంటే అత్యల్ప టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఆసియా కప్ 2022లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ఈ షోపై ప్రభావం చూపింది.
నిరాశపర్చిన కంటెస్టెంట్స్ ఫర్మామెన్స్: ఈ సీజన్ ప్రారంభంలో వినోదభరితమైన టాస్క్‌లతో మొదలైంది. కానీ చివరికి దాగా అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఇది ప్రేక్షకుల ఆసక్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సీజన్ చివరి భాగంలో కొన్ని వినూత్న టాస్క్‌లు ప్రవేశపెట్టి ఉండాల్సింది.
కంటెస్టెంట్స్ బలహీనతలు: ఈ సీజన్‌లో కొంతమంది పోటీదారులు బిగ్ బాస్ ఛాలెంజ్‌ను ప్రభావితం చేసినా.. కొందరు పోటీదారుల పనితీరు కారణంగా విజయవంతమైన టాస్క్‌లు కూడా సక్సెస్ కాలేదని బిగ్ బాస్ ప్రస్తావించారు. గీతూ, ఇనయ లాంటి కంటెస్టెంట్ల ఫర్ఫామెన్స్ ఇతర కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షించింది.
ఆకట్టుకోలేక పోయిన జంటలు: టాస్క్‌లతో పాటు రొమాంటిక్ ట్రాక్స్ కూడా ఈ షో చూసే అభిమానులను ఆకట్టుకుంటాయి. కానీ ఈ సీజన్‌లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య సూర్య, ఆరోహి జోడీలు ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాయి. సూర్యపై తనకు క్రష్ ఉందని ఇనయ చెప్పినా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు.
ఊహించని ఎలిమినేషన్స్: అభినయ శ్రీ, సుదీప, బాలాదిత్య, గీతూ, ఇనయ లాంటి పోటీదారులను ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఒక వర్గం గీతూ, ఇనాయను తొలగించడాన్ని తప్పుబట్టారు.
టీవీ, ఓటీటీలో ప్రసారం: ఈ కార్యక్రమం టీవీతో పాటు, ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్‌లోని ఈవెంట్‌లను 'లీక్' చేయడం మరింత దెబ్బతీసింది. ఈ సీజన్‌లో వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటం వెనుక ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున అక్కినేని తప్ప మరెవరూ ధృవీకరించలేదు. వీక్షకుల సంఖ్య తగ్గడం గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నానని నాగార్జున అన్నారు. అయితే మేకర్స్ ఈ విషయంలో సంతోషంగా ఉన్నందున షో కొనసాగించమని చెప్పారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment