Bigg Boss 6 Telugu: Srihan Won Ticket to Finale Task - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: టాప్‌ 5లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్‌ అతడే!

Published Fri, Dec 2 2022 8:32 PM | Last Updated on Fri, Dec 2 2022 9:27 PM

Bigg Boss 6 Telugu: Shrihan Won Ticket to Finale Task - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ కథ క్లైమాక్స్‌కు చేరువైంది. టికెట్‌ టు ఫినాలేతో టాప్‌ 5లో ఎవరు మొదట అడుగుపెడతారనేది తేలిపోనుంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ పెడితే మాత్రం మరో రెండు వారాల్లో సీజన్‌కు కొబ్బరికాయ కొట్టేయడం ఖాయం. ఇకపోతే టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో ఏకాభిప్రాయం అంటూ పదేపదే హౌస్‌మేట్స్‌ను ఇరుకునపెడుతున్నాడు బిగ్‌బాస్‌.

ఈ టాస్క్‌లో ఇప్పటికే కీర్తి, ఇనయ, శ్రీసత్య అవుట్‌ అయిపోగా మిగతా ఐదుగురు రేసులో ఉన్నారు. ఈ పోటీలో చివరగా శ్రీహాన్‌, రేవంత్‌ మిగలగా శ్రీహాన్‌ గెలిచి టికెట్‌ టు ఫినాలే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి శ్రీహాన్‌ ఈ టికెట్‌ టు ఫినాలే గెలవకపోయినా ఈజీగా టాప్‌ 5లో ఉంటాడు. ఏదేమైనా ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్టుగా నిలిచిన శ్రీహాన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు అభిమానులు.

చదవండి: జూబ్లీహల్స్‌లో 84 ఎకరాల ఫామ్‌ హౌస్‌
ప్రముఖ నటి కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement