![Bigg Boss Telugu Vasanthi Krishnan Marriage Details - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/21/Bigg-Boss-Telugu-Vasanthi-Krishnan.jpg.webp?itok=OVPt7eQZ)
తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకుంది. తన సొంతూరు తిరుపతిలో ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్థరాత్రి ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన వాసంతి.. సీరియల్, సినిమాల్లో నటి. 'సిరిసిరి మువ్వలు' సీరియల్‌తో ఇండస్ట్రీలోకి వచ్చింది. గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్ చేసింది. గతేడాది 'భువన విజయం' లాంటి పలు చిన్న చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈమె పలు సినిమాలు చేసింది.
ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్‌తో వాసంతి కృష్ణన్.. గతేడాది ప్రేమలో పడింది. అలా ప్రేమికులు కాస్త గతేడాది డిసెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వాసంతిలానే ఈమె భర్త పవన్ కూడా నటుడే. హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment