Bigg Boss 6 Telugu: Geetu Royal New Tattoo With Cheetah Marks, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Geetu Royal: తుప్పాస్‌ పని చేశా, అమ్మకి తెలిస్తే చెప్పుతో కొడుతుంది

Published Thu, Dec 1 2022 4:59 PM | Last Updated on Sat, Dec 3 2022 5:11 PM

Bigg Boss 6 Telugu: Geetu Royal New Tattoo - Sakshi

నేను ఎలిమినేట్‌ అయిన రోజు బాగా ఏడ్చేసరికి డిప్రెషన్‌లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి

బిగ్‌బాస్‌ షోయే తన ప్రపంచం అనుకుంది గీతూ రాయల్‌. వీలైతే టాప్‌ 5లో చోటు కుదిరితే కప్పు కూడా పట్టుకొచ్చేదామనుకుంది. కానీ ఆమె ఆట, మాట తీరు నచ్చకపోవడంతో టాప్‌ 10లో కూడా ఉంచకుండానే ఆమెను ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించారు. ఊహించని ఎలిమినేషన్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది గీతూ. 20 రోజుల డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చాక ఓ తుప్పాస్‌ పని చేశా, ఈ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో వదిలింది గీతూ.

అందులో ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్‌ చూసి ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మ నా కోసం హౌస్‌లోకి వస్తుందని చీర కూడా కొని రెడీగా పెట్టాను. ఫ్యామిలీ ఎపిసోడ్‌ అయ్యాక ఎలిమినేట్‌ అయినా బాగుండేది. నేను ఎలిమినేట్‌ అయిన రోజు బాగా ఏడ్చేసరికి డిప్రెషన్‌లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి నాగార్జునగారు బాగా క్లాస్‌ పీకినరోజే ఆయన్ని కలిసాను. ఆయన నన్ను మళ్లీ ఓదార్చాడు అని చెప్పుకొచ్చింది.

ఈ వీడియోలో ఆమె తన కుడికాలిపై చిరుతచారల పచ్చబొట్టు వేయించుకుంది. టాటూ వేయించుకునేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి బిగ్‌బాస్‌ చూస్తూ కూర్చుంది. కాలిపై ఉన్న గాయం తాలూకు మచ్చను కప్పివేసేందుకే టాటూ వేయించుకున్నట్లు తెలిపింది గీతూ.

చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి
పెళ్లి ఫొటోల్లో లావుగా ఉందంటూ ట్రోల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement