బిగ్‌బాస్ గేమ్‌ను రఫ్ఫాడించింది గీతూ రాయల్. టాప్ 5లో ఉంటుందనుకుంటే తొమ్మిదో వారంలోనే బయటకు వచ్చేసింది. విన్నర్ అయి కప్పు కొడతాననుకుంటే కనీసం టాప్ 10లో కూడా లేనని తెగ బాధపడిపోయింది గీతూ. బిగ్‌బాసే ప్రాణం అనుకున్న ఆమె తన ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
'నేను పీఆర్ లేకుండా బిగ్‌బాస్‌కు వెళ్లాను. దీనివల్ల నేను కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నడిస్తే తప్పు అన్నట్లుగా అయిపోయింది. ఇక నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం నా ఓవర్ కాన్ఫిడెన్స్. ఓటమిని తీసుకోలేకపోయాను, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక క్వారంటైన్‌లో ఉన్న గదికే వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాను. ఆ రెండురోజులు తిండితిప్పలు మానేసి రిపీట్ మోడ్‌లో ఎలిమినేషన్ ఎపిసోడ్ పెట్టుకుని దాన్నే చూస్తూ ఏడ్చుకుంటూ ఉండిపోయా. తర్వాత అమ్మానాన్న వచ్చి బాధపడొద్దని నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు నాకు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు, ఎడిటింగ్‌లు చూసి కొంతమంది మనుషులను గెలుచుకున్నానని సంతృప్తి చెందాను.
బిగ్‌బాస్ సీజన్ 6 గెలిచే అర్హత ఆది రెడ్డికే ఉంది. రేవంత్‌కు కూడా గెలిచే అర్హత ఉంది కానీ అతడికి భయంకరమైన కోపం ఉంది. అదే అతడి మైనస్! హౌస్‌లో ఇనయ లేకపోతే ఇంత కంటెంట్ ఉండేదే కాదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఆమె ఫేక్‌గా అనిపిస్తుంది. ఆమె లేకపోతే బిగ్‌బాస్ చూడబుద్ధే కాదు. తను రన్నర్ కాదుకానీ టాప్ 5లో ఉంటుంది. ఇంకా ఆది, రోహిత్, రేవంత్ టాప్ 5లో ఉంటారు. వెటకారం వల్ల శ్రీహాన్ నెగెటివ్ అవుతున్నాడు. కాబట్టి అతడు టాప్ 5లో ఉంటాడో లేడో చెప్పలేకపోతున్నా. నాకు పుష్ప 2లో ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే పుష్ప కో డైరెక్టర్ నా నంబర్ అడిగారని నాకూ తెలిసింది. అంతే తప్ప వాళ్లు నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు. భవిష్యత్తు ప్రణాళికల విషయానికి వస్తే నేను మంచి పొలిటీషియన్ కావాలనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్.
చదవండి: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, నిన్నేమనాలి?
వాళ్లది తొండి గేమ్, ఫైమాకు వెటకారం ఎక్కువే
Comments
Please login to add a commentAdd a comment