Bigg Boss 6 Telugu: Geetu Royal Upset Over Nagarjuna and BB Team - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నన్ను మునగ చెట్టెక్కించారు, తోపు అని ఫీలయ్యా, చివరికి..

Published Fri, Nov 11 2022 6:17 PM | Last Updated on Sat, Nov 12 2022 11:47 PM

Bigg Boss 6 Telugu: Geetu Royal Upset Over Nagarjuna and BB Team - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో గీతూ రాయల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్నారంతా! కచ్చితంగా టాప్‌ 5లో ఉంటుందని ఊహించారు. గీతూ అయితే ఏకంగా విన్నర్‌ అవుతానని ఫిక్స్‌ అయిపోయింది. తానిలా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అయిపోవడానికి ప్రధాన కారణం బిగ్‌బాసే అంటోంది. 'బిగ్‌బాస్‌, నాగార్జున నన్ను బాగా పొగిడేవారు. కానీ అది ఎపిసోడ్‌లో చూపించలేదు. నేనేం చేసినా బిగ్‌బాస్‌ ఎప్పుడూ తప్పని చెప్పలేదు. నాగార్జున అయితే ప్రతీవారం నా గేమ్‌ను మెచ్చుకునేవారు. మీకు వీకెండ్‌ ఎపిసోడ్‌ గంట మాత్రమే చూపిస్తారు. కానీ అక్కడ నాలుగైదు గంటలు జరిగేది. అందులో నన్ను భయంకరంగా పొగిడేవారు. అది చూసి నేనింత తోపా అని నేనూ ఫీలైపోయాను. బిగ్‌బాస్‌ దత్తపుత్రిక గీతూ అంటున్నారు కదా, హౌస్‌లో ఉన్నప్పుడు నాకూ అలాగే అనిపించింది.

బిగ్‌బాస్‌కు నేనంటే ఇష్టం కావచ్చు, అందుకే ఏం చేసినా ఏమీ అనట్లేదనుకున్నాను. బిగ్‌బాస్‌ టీమ్‌ నన్ను మునగ చెట్టెక్కించింది. నాకింక తిరుగులేదనుకున్నా. టాప్‌ 5లో సీటు గ్యారెంటీ, గెలిచే ఛాన్స్‌ కూడా ఉందనుకున్నా. ఓడిపోయాక తెలిసింది అది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అని! నేను బయటకు వచ్చేటప్పుడు కూడా నాగార్జున.. ఈ హౌస్‌లో నటించని, మాస్క్‌ లేని ఏకైక కంటెస్టెంట్‌ గీతూ అన్నారు. హౌస్‌మేట్స్‌ అందరిలో ఫైర్‌ తెప్పించింది గీతూనే అన్నారు. కానీ అది ఎపిసోడ్‌లో చూపించలేదు. ప్రాణం పోయినా గీతూ అబద్ధం చెప్పదు. కెప్టెన్‌ కాకుండానే బయటకు వచ్చాను, హౌస్‌ను ఒక్కసారి కూడా పాలించలేదని నాగార్జున దగ్గర బాధపడితే ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు కెప్టెన్‌ అవ్వకపోయినా 9 వారాలు హౌస్‌ను పాలించావన్నాడు. ఇంత ఎక్కించాక ఎవరైనా తోపని ఫీలవకుండా ఉంటారా?' అని బాధపడింది గీతూ.

చదవండి: గీతూ అలాగే వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు మొదలుపెట్టారా?
చెత్త సంచాలక్‌, గేమ్‌ సర్వనాశనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement