Bigg Boss 6 Telugu: Geetu Royal Cries After Watching Family Episode In BB6, Video Viral - Sakshi
Sakshi News home page

Geetu Royal Crying Video: హౌస్‌లో ఆ కోరిక తీరలేదని ఏడ్చేసిన గీతూ, వీడియో వైరల్‌

Published Wed, Nov 23 2022 8:19 PM | Last Updated on Fri, Nov 25 2022 5:13 PM

Bigg Boss 6 Telugu: Geetu Royal Cries Over Watching Family Episode - Sakshi

బిగ్‌బాస్‌ షోలో తమను నిరూపించుకోవాలని, ప్రేక్షకుల మనసులు గెలిచి విజేతగా నిలవాలని ఇలా ఎన్నో కలలు కంటుంటారు కంటెస్టెంట్లు. ఏ కొద్ది మంది మాత్రమే వారి కలను సాకారం చేసుకుంటారు. మిగతావాళ్లు  ప్రయాణం మధ్యలోనే వెనుదిరుగుతారు. అందులో గీతూ రాయల్‌ ఒకరు. బిగ్‌బాస్‌ షో అంటే పడి చచ్చే ఆమెకు ఆరో సీజన్‌లో పాల్గొనే బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. విన్నర్‌ అయిపోతానని తనకు తానే ఫిక్స్‌ అయిపోయింది.

కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ వల్ల ఆటకు ఆటంకం కలిగింది. ప్రయాణం మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. కనీసం టాప్‌ 10లో.కూడా పత్తా లేకుండా పోయింది. ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది గీతూ. ఆట నుంచి అర్ధాంతరంగా తొలగిపోవడాన్ని తట్టుకోలేక లోలోపలే కుమిలిపోతోంది. హౌస్‌లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్‌బాస్‌ అంటూ సవాల్‌ విసిరిన గీతూ ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ షో చూస్తూ మరోసారి ఏడ్చేసింది. ఫ్యామిలీ వీక్‌ కావడంతో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హౌస్‌లో అడుగుపెడుతున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను గీతూ భర్త వికాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

'గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్‌ కోసం చాలా కలలు కంది. షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్‌ ఎలిమినేషన్‌ మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోయాం. ఫ్యామిలీ థీమ్‌లో వాళ్ల అమ్మను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూడాలనుకుంది. ఇప్పుడిలా ఎపిసోడ్‌ చూసేటప్పుడు వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉంటారనుకుంటున్నాం' అని రాసుకొచ్చాడు గీతూ భర్త.

చదవండి: రోహిత్‌ కోసం ఎవరు వచ్చారో తెలుసా?
ఎట్టకేలకు ఓటీటీలో కాంతార రిలీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement