
Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌కి సంచాలక్‌గా ఇనాయాను నియమించాడు బిగ్‌బాస్. మొదటి దశలో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్, ఫైమా, కీర్తి మాత్రం గేమ్ నియమాలకు విరుద్దంగా సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలక్‌గా ఉన్న ఇనయా గమనించలేదు. దీంతో బిగ్‌బాస్ ఇనయాను తొలగించి రేవంత్‌ని సంచాలక్‌గా నియమించాడు.
రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే కఠిన నియమాలు పెట్టాడు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ ఆదేశంతో అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్.
ఆ తర్వాత రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై దాడి చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే పోటీదారులు మాత్రం పెద్దగా గొడవకు దిగలేదు. దొంగిలించడం పక్కకి పెట్టి తమ బొమ్మలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇనయా మాత్రం శ్రీహాన్ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో శ్రీహాన్ ఇనయాని గట్టిగా హత్తుకొని తన బొమ్మ దగ్గరకు వెళ్లకుండా చేశాడు. ఇనయా కూడా గతంలో మాదిరి గట్టిగా దాడికి దిగలేదు. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చేశారు. శ్రీసత్య ఈ విషయాన్ని గమనించి ‘అసలు మీరిద్దరు ఏం చేశారు?’ అని అడగ్గా.. ఇనయా సిగ్గు పడుతూ.. ఎటాక్ చేశామని చెప్పింది. ‘అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి’ అని శ్రీసత్య చెప్పింది.
ఇంతటితో ఆగకుండా.. ఇనయాతో బాగానే చేశావే.. దొరికిపోయావ్ శ్రీహాన్ అంటూ ఆటపట్టించింది. రేవంత్, ఫైమా అయితే ఏకంగా వీరిద్దరు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించారు. శ్రీహాన్, ఇనయాలు ఈ విషయాన్ని కామెడీగానే తీసుకున్నారు. శ్రీహాన్ అయితే ఈ సంఘటనను మగధీర సినిమాతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని, ఇనయా ఐటమ్ గర్ల్ అని చెప్పాడు. దీంతో ఇనయా అలుగుతుంది. ఆమెను కూల్ చేసేందుకు నాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత స్నోమెన్ టాస్క్‌లు తక్కువ వస్తువులు సేకరించిన కారణంగా ఇనయా, కీర్తిలను తొలగిస్తున్నట్లు సంచాలక్ శ్రీసత్య ప్రకటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment