Bigg Boss 6 Telugu, Episode 83 Highlights: Captain Inaya Sultana Said These Rules | Inaya Sultana First Semi Final Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రేషన్‌ మేనేజర్‌ రేవంత్‌ నుంచి కంటెస్టెంట్లకు విడుదల

Published Fri, Nov 25 2022 11:29 PM | Last Updated on Sat, Nov 26 2022 8:47 AM

Bigg Boss Telugu 6: Captain Inaya Sultana Said These Rules - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 83: ఫైమాకు ఆకలైందో మరేంటో కానీ పొద్దుపొద్దునే గార్డెన్‌ ఏరియాలో ఉన్న మట్టి ఏరుకుంటూ తింది. అది చూసిన బిగ్‌బాస్‌ ఆమెను ఓ ఆటాడుకున్నాడు. మీ రేషన్‌ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్‌ అవసరం లేదని సెటైర్లు వేశాడు. తనకు ఫుడ్‌ కట్‌ చేయమంటున్నాడేమోనని అనుకున్న ఫైమా ఇకమీదట మట్టి తిననని చెంపలేసుకుని సారీ చెప్పింది. తను వేసింది జోక్‌ అని అర్థం చేసుకోలేకపోయిన ఫైమాకు నాలుగు ఎక్స్‌ట్రా గుడ్లు పంపించాడు బిగ్‌బాస్‌.

తర్వాత రేవంత్‌కు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అతడి భార్య అన్వితతో వీడియోకాల్‌ మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఆమె డెలివరీ డేట్‌ కూడా ఇచ్చారని శుభవార్త చెప్పింది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నానని చెప్పింది. ఇంతలో సడన్‌గా వీడియోకాల్‌ కట్‌ అవ్వడంతో రేవంత్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇంకా మాట్లాడాలి బిగ్‌బాస్‌, ప్లీజ్‌ అని దీనంగా వేడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూడగానే రేవంత్‌ దుఃఖం పటాపంచలైంది.

తల్లిని మనసారా హత్తుకుని ఆమెతో తనివితీరా మాట్లాడాడు. గడ్డం వద్దని అమ్మ చెప్పగానే వెంటనే దాన్ని తీసేసుకుని కొత్త లుక్‌తో కనిపించాడు. ఎక్కువ కోప్పడుతున్నావు, ఊరికే ఏడుస్తున్నావు, నెట్లో పెట్టేస్తున్నారు, కాస్త చూసుకోరా అని కొడుక్కి సలహాలు ఇచ్చింది. అలాగే వంటగదిలో రేషన్‌ దగ్గర కక్కుర్తి పడి అందరికీ అది ఇవ్వను, ఇది ఇవ్వను అనడం బాలేదంది. ఆ తర్వాత అందరితో కలిసి స్టెప్పేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది పెద్దావిడ. ఏదేమైనా రేవంత్‌కు డబుల్‌ ధమాకా అందిందని హౌస్‌మేట్స్‌ సంతోషించారు. కానీ రేవంత్‌ మాత్రం భార్యతో ఇంకాసేపు మాట్లాడాలని ఉందని మనసులో పదేపదే బాధపడ్డాడు.

అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన చివరి కెప్టెన్సీ టాస్క్‌లో ఇనయ గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. ఎట్టకేలకు తను కెప్టెన్‌ కావడంతో భావోద్వేగానికి లోనైంది. చివరి కెప్టెన్‌ అయిన ఇనయ నేరుగా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. కెప్టెన్‌గా కొత్త నిబంధనలేమీ పెట్టడం లేదని ఎంజాయ్‌ చేద్దామంది. అలాగే ఎవరికి ఎంత ఫుడ్‌ కావాలంటే అంత తినండి అని చెప్పింది. దీంతో హౌస్‌మేట్స్‌ తెగ సంబరపడిపోయారు.

చదవండి: శ్రీసత్య ఎప్పుడు వెళ్లిపోతుందా? అని ఎదురుచూసిన హమీదా
కష్టాల్లో ఉన్న పనిమనిషికి సాయం చేసిన నయనతార

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement