Bigg Boss Telugu 6: Marina Will Eliminate From BB Show - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: జంటను విడదీసిన బిగ్‌బాస్‌, ఆ కంటెస్టెంట్‌ అవుట్‌!

Published Sat, Nov 19 2022 3:37 PM | Last Updated on Sun, Nov 20 2022 5:45 PM

Bigg Boss Telugu 6: Marina Will Eliminate From BB Show - Sakshi

ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్‌నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు మెరీనానే! ఈ వారం కెప్టెన్‌ ఫైమా, ఇమ్యూనిటీ సంపాదించుకున్న రాజ్‌ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో మెరీనా, రోహిత్‌, కీర్తి డేంజర్‌ జోన్‌లో ఉండగా మెరీనాకు తక్కువ ఓట్లు పడటంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

మెరీనా.. తన కోరిక తీరకుండానే బిగ్‌బాస్‌ నుంచి బయటకు రానున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఒక్కవారం హౌస్‌లో ఉండాలని, భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్‌ హౌస్‌లో పెళ్లిరోజు జరుపుకోవాలని కలలు కంది. చివరికి ఆమె కూడా తన ఎలిమినేషన్‌ను ముందే ఊహించిందో ఏమోకానీ జంటను విడదీయకండి బిగ్‌బాస్‌, ఉంటే ఇద్దరినీ ఉంచండి.. పంపిస్తే ఇద్దరినీ పంపించేయండి.. మేము యానివర్సరీ సెలబబ్రేట్‌ చేసుకోవాలని కోరింది. ఇద్దరినీ హౌస్‌లో ఉండమనడం ఓకే కానీ సేవ్‌ అయ్యే మనిషిని కూడా తనతో పాటే పంపించేయమనడమే ఒకింత విచిత్రంగా ఉంది.

ఫినాలే దగ్గర పడుతున్న సమయంలో భర్తను ఇంటికి తీసుకెళ్లిపోతాననడమేంటని ఆడియన్స్‌ అవాక్కయ్యారు. కొంపతీసి మెరీనా అన్న మాటలను బిగ్‌బాస్‌ సీరియస్‌గా తీసుకుని డబుల్‌ ఎలిమినేషన్‌ పెడతారా? అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ చివరికి సింగిల్‌ ఎలిమినేషన్‌తో మెరీనాను మాత్రమే హౌస్‌లో నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. మరి మెరీనా ఎలిమినేషన్‌ రోహిత్‌కు ప్లస్‌ అవుతుందా? మైనస్‌ అవుతుందా? అనేది చూడాలి!

చదవండి: కర్మ ఫలితం.. రేవంత్‌, శ్రీహాన్‌లకు బుద్ధి చెప్పిన హౌస్‌మేట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement