బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఎప్పుడు ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్నవారు ఎప్పుడో ఎలిమినేట్ అవగా గ్రాండ్ ఫినాలే వీక్‌లో మరొకరిని పంపించి ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరోపక్క ఈ సీజన్‌లో చాలావరకు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయంటూ నెటిజన్లు నెట్టింట మండిపడ్డ విషయం తెలిసిందే! మరీ ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్‌తో ఈ ఆగ్రహం పీక్స్‌కు వెళ్లింది.
అయితే దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడని, ఇక మీదట బిగ్‌బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు నెక్స్ట్ సీజన్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్‌గా రానున్నాడన్న ప్రచారమూ ఊపందుకుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.
కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోకి ఆదరణ తగ్గడమే కాక విమర్శలు ఎక్కువయ్యాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌కే అతి తక్కువ(8.5) టీఆర్పీ వచ్చింది. దీనిపై నాగ్ సైతం కొంత అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సీజన్‌లో మలుపులు, అన్‌ఫెయిర్ ఎలిమినేషన్లు టీఆర్పీకి గుదిబండగా మారాయి. అటు ప్రేక్షకులు సైతం ఈ సీజన్‌ను ఫ్లాప్ సీజన్‌గా తేల్చేశారు. కనీసం నెక్స్ట్ సీజన్‌కైనా మంచి కంటెస్టెంట్లను, ఫెయిర్ ఎలిమినేషన్లు పెట్టండని చురకలంటిస్తున్నారు.
చదవండి: రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని చెప్పాం
త్వరలో కొత్త జీవితం ప్రారంభిచబోతున్నా: మంచు మనోజ్
Comments
Please login to add a commentAdd a comment