Inaya Sultana Comments On Her Dance Video With Ram Gopal Varma, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ 6: ‘ఆ వీడియో చూసి మా ఇంట్లో వాళ్లే నన్ను తప్పుగా చూశారు’

Published Tue, Nov 29 2022 3:43 PM | Last Updated on Tue, Nov 29 2022 4:47 PM

Inaya Sultana Open Up on Dance Video With Ram Gopal Varma - Sakshi

ఇనయ సుల్తానా.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఇనయ టాప్‌ కంటెస్టెంట్‌లో ఒకరిగా దూసుకుపోతోంది. బిగ్‌బాస్‌కు ముందు ఇనయ ఓ వైరల్‌ వీడియోతో సోషల్‌ మీడియాకు పరిచయమైన సంగతి తెలిసిందే. తన బర్త్‌డే పార్టీలో వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో కలిసి డాన్స్‌ చేసి ఆమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

అలా ఆర్జీవీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకుంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టడానికి ముందు ఇనయ ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా రామ్‌ గోపాల్‌ వర్మ డాన్స్‌ వీడియోపై ఆమె స్పందించింది. ‘‘సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆర్జీవీ సార్‌తో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో నా పుట్టిన రోజు కూడా ఉండటంతో ఆయనను పార్టీకి పిలిచాను. అదే సమయంలో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. ఆ వీడియో నా బర్త్ డే జరిగిన నాలుగు రోజుల తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చింది.

 ‘పరువు మొత్తం తీస్తున్నావ్‌’ అంటూ కుటుంబ సభ్యులు తిట్టారు. అది నన్ను చాలా బాధించింది. ఆ వీడియో చూసి మా బంధువులంత నన్ను ద్వేషించడం స్టార్ట్‌ చేశారు.  నా గురించి మాట్లాడటం కూడా మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే నేను వాళ్ళ గురించి కూడా ఎక్కడా చెప్పాలనుకోవడం లేదు’’ అంటూ ఇనయ ఎమోషనల్‌ అయ్యింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను సినిమాల్లోకి రావడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, అదే సమయంలో ఆ వీడియో వైరల్‌ కావడం వాళ్లు చాలా బాధపడ్డారని చెప్పింది. అంతేకాదు అప్పటి నుంచి తనని తప్పుగా చూస్తున్నారని, పరువు తీస్తున్నావంటూ తనని ద్వేషిస్తున్నారని ఇనయ ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: 
‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై ఇఫి జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్‌
డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement