Bigg Boss 6 Telugu: Inaya Sultana Emotional About RJ Surya - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: సూర్య బాగా క్లోజ్‌ అయ్యాడు.. చేసింది తప్పే.. భారంగా ఉంది: ఇనయా ఎమోషనల్‌

Published Wed, Oct 26 2022 9:58 AM | Last Updated on Wed, Oct 26 2022 10:43 AM

Bigg Boss 6 Telugu: Inaya Emotional About Surya - Sakshi

బిగ్‌బాస్ షో ప్రతి సీజన్‌లో లవ్‌ ట్రాక్‌ కచ్చితంగా ఉంటుంది. కొంచెం క్లోజ్‌గా మూవ్‌ అయితే చాలు.. ఆ సీన్స్‌ని హైలెట్‌ చేసి చూపిస్తూ వారిద్దరి మధ్య ప్రేమ లేకున్నా.. లవ్‌లో పడేలా చేస్తాడు. అయితే కొంతమంది మాత్రం జస్ట్‌ షోలో ఉన్నంతవరకు ఈ ప్రేమాయణం జరిపి బయటకు వెళ్లాక ఎవరి దారిలో వారు వెళ్తారు. మరికొంత మంది లవ్‌ట్రాక్‌లో పడేసేందుకు బిగ్‌బాస్‌ ఎంత ప్రయత్నించినా.. చాన్స్‌ ఇవ్వరు. ఆరో సీజన్‌లో లవ్‌ట్రాక్‌లు నడిపేందుకు బిగ్‌బాస్‌ నానా తిప్పలు పడుతున్నాడు. అర్జున్‌-శ్రీసత్యలను కలిపేందుకు విఫల ప్రయత్నం చేసినా.. శ్రీసత్య నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. ఇక షో ప్రారంభంలోనే ఆర్జే సూర్య, ఆరోహి రావుల మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపించే ప్రయత్నం చేశాడు.

(చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో చేపల లొల్లి..వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ)

వీరిద్దరు బయట  క్లోజ్ ఫ్రెండ్ కావడంతో హౌస్‌లోనూ జోడీగా కొద్ది రోజులు రచ్చ  చేశారు. వీరిద్దరు ప్రేమలో పడడం ఖాయం అనుకున్న సమయంలో తెరపైకి బుజ్జమ్మ మ్యాటర్‌ వచ్చేసింది. సూర్యకి బయట బుజ్జమ్మ అలియాస్‌ మృదుల అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని, ఆమెతో పదేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నానని సూర్య పదే పదే చెప్పడంతో బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు.

ఆరోహి వెళ్లాక ఇనయాను టార్గెట్‌ చేశాడు. నాగార్జునతో పదేపదే పొద్దు తిరుగుడు పువ్వు అని చెప్పిస్తూ.. వారిద్దరి మధ్య ప్రేమను పుట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇదంతా తనకు ప్లస్‌ అవుతుందని భావించిన సూర్య.. ఇనయాతో క్లోజ్‌గా మూవ్‌ అవుతూనే.. అప్పుడప్పుడు ‘బుజ్జమ్మ’మ్యాటర్‌ తెస్తున్నాడు. ఇక ఇనయా కూడా తమ ఫ్రెండ్‌షిప్‌ మ్యాటర్‌ బిగ్‌బాస్‌ ఎటో తీసుకెళ్తున్నాడని గ్రహించి, దూరంగా ఉండి గేమ్‌ ఆడేందుకు సిద్దమైంది. సోమవారం నామినేషన్స్‌లో ఏకంగా సూర్యతో గొడవకు కూడా దిగింది. దీంతో సూర్య, ఇనయాల విషయంలో కూడా బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదని అంతా భావించారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌తో ఎట్టకేలకు తాను విజయం సాధించానని నిరూపించాడు బిగ్‌బాస్‌. 

ఇనయా నిజంగానే సూర్యతో ప్రేమలో పడిపోయింది. తనను దూరం పెట్టడం భారంగా ఉందంటూ మెరినాతో చెబుతూ ఎమోషనల్‌ అయింది. సూర్య అంటే ఎక్కువ ఇష్టమా? స్నేహితుడి కంటే ఎక్కువనా? అని మెరినా అడిగిన ప్రశ్నకు.. ‘అవును’ అని సమాధానం ఇచ్చింది ఇనయా. ‘బాధ ఎక్కువైపోతుంది. ఎందుకో మనసంతా భారమైపోయింది. సూర్య స్నేహితుడి కంటే ఎక్కువ క్లోజ్‌ అయిపోయాడు. కానీ తప్పు కదా.. కొన్ని కొన్ని అక్కడి వరకు ఆపేస్తేనే లైఫ్‌కి చాలా బెటర్‌’అని ఇనయా చెప్పుకొచ్చింది. సూర్య లైఫ్‌లో బుజ్జమ్మ ఉందనే కారణంగా ఇనయా దూరంగా ఉంటున్నట్లు అర్థమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement