బిగ్‌బాస్ హౌస్‌లో పదోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘పాము- నిచ్చెన’ ఆట ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి మట్టితో పాము, నిచ్చెనలను కట్టాలి. రేవంత్, రాజ్,ఇనయా, మెరీనా, బాలదిత్య, శ్రీసత్య నిచ్చెన టీమ్‌లో ఉండగా.. మిగిలిన సభ్యులు పాముల టీమ్‌లో ఉన్నారు. . నిచ్చెనల టీమ్ నుంచి ఇనాయాను సంచాలక్‌గా నియమించగా.. పాముల టీమ్ నుంచి ఫైమాను సంచాలక్‌గా ప్రకటించారు. ఇరు జట్లు బంకమట్టి సంపాదించిన పాములు, నిచ్చెనలు తయారు చేయాలి. సమయానుసారం ఒక టీమ్ సభ్యుడు.. మరో టీమ్‌లో తనకిష్టమైన సభ్యుడిని ఎంచుకుని వారి నుంచి బంకమట్టిని తీసుకునే ప్రయత్నం చేయాలి.
దీంతో పాముల టీమ్ నుంచి కీర్తి.. నిచ్చెనల టీమ్‌లోని రాజ్‌ను ఎంచుకుని అతడి బంకమట్టిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అసలే గాయంతో విలవిల్లాడుతున్న కీర్తి..బలవంతుడైన రాజ్‌ని ఎంచుకొని తప్పు చేసింది. అతని నుంచి కొంచెం మట్టిని కూడా కీర్తి తీసుకోలేకపోయింది. నొప్పి కంటే ఎక్కువగా దీని కారణంగా ఆడలేకపోతున్నా బిగ్‌బాస్ అంటూ ఎమోషనల్ అయింది. . అనంతరం నిచ్చెనల టీమ్ నుంచి శ్రీసత్య బంకమట్టి దొంగతనానికి బయల్దేరుతుంది.
పాముల టీమ్ నుంచి వాసంతిని ఎంచుకుంటుంది. అయితే వాసంతి మాత్రం కొంచెం మట్టిని కూడా వదులుకోలేదు. శ్రీసత్యని గట్టిగా పట్టుకొని కిందపడేసి మట్టిని ముట్టుకోకుండా చేసింది. అనంతరం తక్కువ మట్టి ఉన్న శ్రీసత్య(నిచ్చెన టీమ్), రోహిత్(పాముల టీమ్)లను ఆట నుంచి తప్పించారు. ఇంతలో బిగ్‌బాస్.. ఈ టాస్క్ చివరి రౌండ్ మరి కాసేపట్లో ముగుస్తుందని, ఇరుటీమ్ సభ్యులు ఎవరు ఎవరి మట్టినైనా దొంగిలించొచ్చు అని బిగ్‌బాస్ చెప్పడంతో అంతా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇనయా, ఫైమాల ఫైట్ హైలెట్‌గా నిలిచింది. ఇనయాను టార్గెట్ చేసిన ఫైమా.. ప్రతిసారి ఆమె మట్టిని కొట్టేసేందుకే ప్రయత్నించింది.
దీంతో ఇనయా శివంగిలా పోరాటం చేసింది. ఫైమాను ఈడ్చి ఈడ్చి పడేసింది. అలాగే ఫైమా కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇనయా, ఫైమాలు కిందపడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు.. ఇనయా అయితే ఫైమా రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ‘ఇనయా తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది’ రేవంత్ చెప్పినా వినలేదు. ఒకరినొకరు అడ్డుకునే క్రమంలో ఇద్దరి దుస్తులు కూడా చిరిగిపోయాయి. అయినా ఎక్కడా తగ్గలేదు.
మరోవైపు శ్రీహాన్ కూడా ఇనయానే టార్గెట్ చేశారు. తన నిచ్చెనను కాపాడేందుకు ఎంతమంది సాయం అడిగినా ఎవరూ రాలేదు. ఈ టాస్క్‌లో చివరివరకు ఒంటరి పోరాటం చేసినా ఇనయా.. తక్కువ మట్టి ఉన్న కారణంగా ఔట్ అయింది. అయితే పాముల టీమ్‌ను నుంచి ఒకరిని తొలగించాల్సిన అవకాశం వచ్చినా.. ఫైమా, శ్రీహాన్‌లలో ఒకరిని కాకుండా జన్యూన్‌గా వాసంతిని తప్పించింది. అనంతరం పాము-నిచ్చెన టాస్క్ ఇంతటితో ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ టాస్క్‌లో గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment