![Bigg Boss Telugu 6: Another Chance to Revive The Prize Money - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/7/revanth-shrihan.gif.webp?itok=IidMoS_D)
మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ కథ ముగియనుంది. ఇలాంటి సమయంలో రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిన బిగ్‌బాస్ సోది టాస్కులిస్తూ మరింత చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఒక్కరూ విన్నర్ మెటీరియల్ అనిపించకపోవడం సీజన్‌కే పెద్ద మైనస్. కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్ అవుతాడనుకున్న రేవంత్ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ నేనే తోపు అన్నట్లుగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.
తాజాగా అతడు ఇంట్లోవారితో మరోసారి గొడవపడ్డట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో రేవంత్.. ఫుడ్ కోసం శ్రీహాన్‌ను కప్పు తెచ్చుకోమన్నాడు. అంతలోనే నేను తినమని చెప్పలేదంటూ మాట మార్చాడు. వెంటనే అందుకున్న శ్రీహాన్, శ్రీసత్య.. ఇప్పుడే కప్పు తెచ్చుకోమన్నావ్ కదా అని నిలదీయడంతో రేవంత్ ఉలిక్కిపడ్డాడు. ప్రతిదాంట్లో తప్పులు వెతికితే నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌పై శ్రీహాన్ గరమయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరూ ప్లాన్ ప్రకారం ఆడి గెలిచినట్లు తెలుస్తోంది. అదెలాగో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం.. శ్రీహాన్ దుప్పట్లో చేరిన శ్రీసత్య
ఆ మూడు దెబ్బల వల్ల బాలీవుడ్‌నే వదిలేద్దామనుకున్నా: హీరో
Comments
Please login to add a commentAdd a comment