Google Shows Rohit Sahni Is Bechamel Bigg Boss 6 Telugu Title Winner - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ 6 విన్నర్‌ ఎవరో చెప్పిన గూగుల్‌ తల్లి, అదే నిజమవుతుందా?

Dec 14 2022 9:59 PM | Updated on Dec 16 2022 5:15 PM

Google Suggest That Actor Rohit Winner of Bigg Boss Telugu 6 - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచిన రోహిత్‌ విన్నర్‌గా అవతరించనున్నాడని తెలిపింది.

బిగ్‌బాస్‌ షో ప్రారంభమవుతుందంటే మురిసిపోయే జనాలు షోకి శుభం కార్డు పడుతుందంటే మాత్రం తెగ ఫీలైపోతుంటారు. కానీ ఈసారి మాత్రం హమ్మయ్య, ఎట్టకేలకు ముగింపు కాబోతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా ఉంది మరి ఈ సీజన్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్‌ అని నాగ్‌ అన్నాడే తప్ప మరీ అంత భీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ అయితే లేదు. పైగా బాగా ఆడుతున్నారనుకున్న కంటెస్టెంట్లను అన్యాయంగా ఎలిమినేట్‌ చేసేసి తమకు కావాల్సిన వాళ్లనే టాప్‌ 5లో పెట్టుకుంది బిగ్‌బాస్‌​ యాజమాన్యం.. అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇనయ సుల్తాన ఎలిమినేట్‌ అయిన తర్వాత ఆరో సీజన్‌పై మరింత విమర్శలు వచ్చిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీఆర్పీ కూడా ఢమాల్‌ అని పడిపోయింది.

ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు ఉన్నారు. రోహిత్‌, రేవంత్‌, కీర్తి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, శ్రీసత్య.. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్‌ కాబోతున్నారు. దీంతో మిగిలిన మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విన్నర్‌ ఎవరనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో గూగుల్‌ తల్లి బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచిన రోహిత్‌ విన్నర్‌గా అవతరించనున్నాడని తెలిపింది. బిగ్‌బాస్‌ 6 విన్నర్‌ ఎవరు? బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ విజేత ఎవరు? ఇలా ఎలా అడిగినా రోహిత్‌ పేరే సూచిస్తోంది. మరి నిజంగానే అతడు టైటిల్‌ అందుకుంటాడేమో చూడాలి!

ప్రస్తుతానికి అనఫీషియల్‌ ఓటింగ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌ మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఆదిరెడ్డి, రోహిత్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. కీర్తి, శ్రీసత్య ఓట్ల శాతంలో వెనకపడినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ షోకి ముందు వరకు రోహిత్‌ ఎవరికీ పెద్దగా తెలియదు. హౌస్‌లో అడుగుపెట్టాకే తన మాటతో, ఆటతో, నిజాయితీతో అభిమానులను సంపాదించుకున్నాడు. అటు హౌస్‌మేట్స్‌తో, ఇటు ప్రేక్షకులతో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనిపించుకున్నాడు. కానీ ఆటలో మిగతావారికంటే కొద్దిగా వెనుకబడటంతో ఓట్లలో కూడా వెనుకపడుతున్నాడు. ప్రస్తుతానికైతే రేవంత్‌ గెలిచే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్‌ ఎమోషనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement