
తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడూ ఉంటాడు. నేనే తోపు, నేనే స్ట్రాంగ్ అని ఫీలయ్యే రేవంత్‌కు ఎదురు తిరిగింది ఫైమా. వేరేవారి సపోర్ట్ లేనిదే గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని రేవంత్ అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది ఫైమా. సపోర్ట్‌తో ఆడిన రేవంత్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించింది. మనిషి ముందు ఒకలా, వెనకాల మరోలా మాట్లాడతాడు. ఎవరికీ ఇది కనిపించట్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముందు నుంచీ తనే నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది. కరెక్ట్ పాయింట్లు లాగడంతో రేవంత్ దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. ఎంతసేపూ నేనే స్ట్రాంగ్, నా ముందు మాట్లాడే ధైర్యం లేదు, వాళ్లకంత సీన్ లేదు అంటూ తోటికంటెస్టెంట్లను చులకన చేసి మాట్లాడే రేవంత్ నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలంటే ఫైమానే కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
చదవండి: ఆదిరెడ్డి వర్సెస్ శ్రీహాన్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అంట
Comments
Please login to add a commentAdd a comment