Bigg Boss 6 Telugu: Marina Abraham Sahni Exit Interview With Anchor Shiva - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: నువ్వూ, రోహిత్‌ ట్రిప్‌కు వచ్చారంతే, అసలేం చేశావని.. మెరీనాను నిలదీసిన యాంకర్‌

Published Mon, Nov 21 2022 6:11 PM | Last Updated on Wed, Nov 23 2022 8:25 PM

Bigg Boss 6 Telugu: Marina Abraham Sahni Exit Interview With Anchor Shiva - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మంచి పేరు మూటగట్టుకున్న ఒక్కొక్కరూ వరుసగా బయటకు వచ్చేస్తున్నారు. బాలాదిత్య, వాసంతి, మెరీనా ఎలాంటి రిమార్క్‌ లేకుండా కడిగిన ముత్యంలా బయట అడుగుపెట్టారు. తాజాగా షో నుంచి బయటకు వచ్చిన మెరీనాను బిగ్‌బాస్‌ కెఫెలో ఇంటర్వ్యూ చేశాడు యాంకర్‌ శివ. ఈ క్రమంలో ఆమెను మరీ కించపరుస్తూ మాట్లాడినట్లు కనిపిస్తోంది.

జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు అన్న మాట హౌస్‌లో నువ్వే ఎక్కువగా వాడావు. జనాలు చూసేందుకు అసలు మీరేం చేశారు? అని ప్రశ్నించాడు. అందుకామె నేను నాలా ఉన్నానని బదులిచ్చింది. ఇంతకీ హౌస్‌లో మీరు గేమ్స్‌ ఆడారా? అని సూటిగా ప్రశ్నించాడు శివ. దానికి మెరీనా.. నావరకు ఎంతయిందో అంతే ఆడానని సాఫ్ట్‌గా ఆన్సరిచ్చింది. నువ్వూ, రోహిత్‌ ఏదో ట్రిప్‌కు వచ్చినట్లు అనిపించిందన్నాడు యాంకర్‌. నేను ఆడగలుగుతానా? లేదా? అని ఎంత టెన్షన్‌ పడ్డానో మీకేం తెలుసు అని కౌంటరిచ్చింది మెరీనా.

వెంటనే శివ అందుకుంటూ నేను ఆడగలనా? లేదా? అని కూడా ఆలోచించారా? అని వెటకారంగా నవ్వాడు. మీరు ఎంత కోపం తెప్పించినా నాకు కోపం రాదని మెరీనా అనగా మీ దగ్గర నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది? అని డైలాగ్‌ వేశాడు. ఈ ఇంటర్వ్యూపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కంటెస్టెంట్లందరినీ ఒకేలా ఇంటర్వ్యూ చేయాలి. అంతే తప్ప సాఫ్ట్‌, కూల్‌గా కనిపించేవారిపై ప్రతాపం చూపించడం కాదని యాంకర్‌ శివకు చురకలంటిస్తున్నారు.

చదవండి: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement