బిగ్‌బాస్ సీజన్-6 గ్లామర్ డాల్‌లో పేరు తెచ్చుకున్న బ్యూటీ వాసంతి కృష్ణన్. ఆట కంటే అందంతోనే కాస్త ఎక్కువ నెట్టుకొచ్చిన వాసంతి గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీతో వెళ్లిందో అంతే పాజిటివ్ స్పిరిట్‌తో ఆమె బయటకొచ్చింది. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాసంతి బిగ్‌బాస్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది.
'బిగ్‌బాస్‌లో 70రోజుల పాటు ఉన్నాను. ఇంకొన్ని రోజులు ఉంటాననుకున్నా. కానీ అలా జరగలేదు. ఇక సూర్య, గీతూల ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఎప్పుడైనా, ఎవరైనా వెళ్లిపోతారు అని డిసైడ్ అయ్యాను. ఇక బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చాక 6కేజీలు తగ్గాను. అక్కడ అందరికీ సరిపోయినంత తిండి ఉంటుంది కానీ ఒత్తిడి వల్ల తిన్నది ఒంటబట్టదు. దీంతో చాలామంది మునుపటి కంటే బరువు తగ్గుతారు' అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment