బిగ్‌బాస్ హౌజ్‌లో గీతూ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌజ్ అంత ఒకటి అంటే తన మరోకటి అంటుంది. తన దారే సపరేట్ అంటూ హౌజ్‌లో అందరికి చుక్కలు చూపిస్తుంది. చిత్తురు యాస మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న గీతూ హౌజ్‌మేట్స్‌కు మాత్రం తలనొప్పిగా ఉంటుంది. ఎలాంటి దాపరికం లేకుండ మనసులో మాటలను నిర్మోహమాటంగా బయట పెడుతుంది.
తన ముక్కుసూటి తనంతో ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ తనదైన ఆట తీరుతో హౌజ్‌మేట్స్‌కి చెమటలు పట్టిస్తుంది. తన యాస, మాటలు, గొడవలు, వివాదాలతో హౌజ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకున్న గీతూకి మిగతా హౌజ్‌మేట్స్‌తో పోలిస్తే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారడంలో అతిశయోక్తి లేదు. ఇక టాస్కుల్లో సైతం అబ్బాయిలకు గట్టి పోటీని ఇస్తుంది. తన విభిన్న వ్యవహర శైలితో అందరిని ఆశ్చర్యపరుస్తున్న గీతూది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో వికాస్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆమె భర్త వికాస్ తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. అతను ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వికాస్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా భార్య ఆట తీరుపై అతడు స్పందిస్తూ.. గీతూ ఆట తనకు బాగా నచ్చిందని, తను చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్ అందిస్తుందన్నాడు. అలాగే తన భార్య అలా టీవీ చూడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక గీతూ తన పక్కన లేకపోవడంతో తనని మిస్ అవుతున్నాననే భావన కలుగుతోందన్నాడు.
పెళ్లయినప్పుటి నుంచి గీతూ దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని చెప్పాడు. ఇక గీతూ మాట తీరు గురించి మాట్లాడుతూ... ‘తన మాట తీరే అంత. ఆమె రూడ్‌గా మాట్లాడినట్లు ఉంటుంది. తన వాయిస్ పెద్దగా ఉండటం వల్ల అల అనిపిస్తుంది. కానీ నిజానికి తను చాలా మృదు స్వభావి. పలకరింపులో కూడా సాఫ్ట్ నెస్ ఉండదు. హౌజ్‌లో గీతూ నటించడం లేదు. సహజంగా ఆమె ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నటన అయితే ప్రతివారం ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుందని కదా’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment