Bigg Boss 6 Telugu Weekend Episode 42 Highlights: Geetu Royal Reveals Secret About Adi Reddy - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: సీక్రెట్‌ బయటపెట్టిన గీతూ.. అతడి కోసం రాత్రంతా ఏడ్చేశానంటూ!

Published Sat, Oct 15 2022 11:42 PM | Last Updated on Mon, Oct 17 2022 5:14 PM

Bigg Boss 6 Telugu: Geetu Royal Reveal One Secret - Sakshi

Bigg Boss Telugu 6, Episode 42: నీ క్రష్‌ ఎవరో చెప్పొచ్చుగా అని ఇంటిసభ్యులు ఇనయను ఆటపట్టించారు. దీంతో ఆమె తెగ సిగ్గుపడుతూ బాత్రూమ్‌ ఏరియాలో ఉన్న సూర్య దగ్గరకు పరుగెత్తికెళ్లింది. ఇంతలో హౌస్‌మేట్స్‌ ఇంకెవరు, సూర్యనే తన క్రష్‌ అయి ఉండొచ్చని కరెక్ట్‌గా గెస్‌ చేశారు. అదే మాట తనను అడగ్గా అందరూ ఊహించిందే నిజమని చెప్పింది. మరోవైపు అర్జున్‌ మీదకు అరిచేసింది శ్రీసత్య.ఈ పంచాయితీలు నాకొద్దు, నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా అన్న రీతిలో గమ్మునుండిపోయాడు అర్జున్‌. కానీ అంతలోనే శ్రీసత్య వచ్చి సారీ చెప్పి అతడిని కూల్‌ చేసింది.

ఇక వీకెండ్‌లో స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ అవసరమైన వారికి వీడియోలు చూపిస్తూ క్లాసులు పీకాడు. ఈ వారం బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌లో రోహిత్‌ గొప్ప త్యాగం చేసిన విషయం తెలిసిందే కదా! రెండు వారాలు సెల్ఫ్‌ నామినేట్‌ అవడంతో బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్‌ అయింది. దీన్ని ఫైమా, రేవంత్‌, వాసంతి, కీర్తి, సూర్య, రాజ్‌ వాడేసుకున్నారు. కానీ రోహిత్‌ వాడుకునేందుకు ఛాన్స్‌ ఇవ్వలేదు. ఇది అన్యాయమని ఇంటిసభ్యులను కడిగిపారేశాడు నాగ్‌. రోహిత్‌ కోసం ఒకరు త్యాగం చేయాల్సిందేనని చెప్పాడు. దీంతో వాసంతిని సెలక్ట్‌ చేయగా బిగ్‌బాస్‌ ఆదేశం మేరకు  తన జుట్టును కత్తిరించుకుంది. అనంతరం రోహిత్‌- మెరీనాలకు వారి ఫ్యామిలీ వీడియో మెసేజ్‌ చూపించడంతో ఇద్దరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

కెప్టెన్‌ రేవంత్‌ రూల్స్‌ మర్చిపోయి ఆదమరిచి నిద్రించిన వీడియోను బిగ్‌బాస్‌ ప్లే చేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత బాలాదిత్యకు అసలు సిసలైన వీడియో చూపించారు. ఓ టాస్క్‌లో భాగంగా ఇల్లంతా ఫుడ్‌ మానేయాలి లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని బిగ్‌బాస్‌ చెప్పాడంటూ గీతూ అందరితో అంది. కానీ బిగ్‌బాస్‌ అక్కడ ఇంటిసభ్యులు కేవలం చక్కెర మాత్రమే త్యాగం చేయాలన్నాడు. దాన్ని ఆమె తనకు నచ్చినట్లు మార్చేసింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన ఆదిత్య నిజమేంటో తెలుసుకుని గుడ్లు తేలేశాడు. అయినా తన చెల్లెలు. గీతూ తన మంచి కోసమే ఇలా చేసిందని వెనకేసుకురావడం విశేషం. కన్ఫెషన్‌ రూమ్‌లోకి వచ్చిన ఫైమాను నాగ్‌ ఏదైనా ఆసక్తికర విషయం చెప్పమన్నాడు. దానికామె సూర్య, ఇయన మధ్య 'క్రష్‌' స్టోరీ ఇంట్రస్టింగ్‌గా ఉందంది.

బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌లో ఎవరు ఎలా పర్ఫామ్‌ చేశారో ర్యాంకులిచ్చాడు నాగ్‌. సూర్య, ఫైమా, రేవంత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, రోహిత్‌ బాగా ఆడారన్నాడు. బాలాదిత్య, రాజ్‌, కీర్తి, వాసంతి, సుదీప, మెరీనా, ఆది రెడ్డి యావరేజ్‌ అని చెప్పాడు. ఇనయ ఒకప్పుడు ఆటలో గుడ్‌, ఈ వారం ఆటలో డెడ్‌ అని చెప్పాడు నాగ్‌. నీ ఫోకస్‌ ఆట నుంచి మనుషుల మీదకు మారిందన్నాడు.అర్జున్‌ ఆట బాగా ఆడుతున్నావ్‌ కానీ ఒక మాట మీద నిలకడగా ఉండనందుకు యావరేజ్‌ అని చెప్పాడు నాగ్‌.

కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన గీతూ.. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ చెప్పింది. బిగ్‌బాస్‌ నన్ను ఏడిపించు అని పదే పదే అంటాను కదా, ఆదిరెడ్డిని తిడ్తుంటే నాకు బాధేస్తోంది అని అతడి భార్య అంది. దీంతో ఆది నాకు దూరమైపోతాడేమో అనిపించింది రాత్రి దుప్పట్లో కుళ్లి కుళ్లి ఏడ్చేశాను అని చెప్పింది.  కాగా, చివర్లో శ్రీసత్య సేఫ్‌ అయినట్లు నాగ్‌ వెల్లడించాడు.

చదవండి: అతడు సేఫ్‌, ఆమె ఎలిమినేట్‌!
సిగరెట్లు లేక అల్లాడుతున్న ఆదిత్య, అతడి భార్య ఏమందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement