Bigg Boss 6 Telugu: Abhinaya, Baladitya, Inaya Sultana Nominated - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నామినేషన్‌ నుంచి తప్పించుకోలేకపోయిన ఆర్జీవీ హీరోయిన్‌

Published Tue, Sep 6 2022 11:42 PM | Last Updated on Wed, Sep 7 2022 8:52 AM

Bigg Boss 6 Telugu: Abhinaya, Baladitya, Inaya Sultana Nominated - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 3: బిగ్‌బాస్‌ షోలో మొదటి రోజునే నామినేషన్స్‌ జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కంటెస్టెంట్ల సత్తా తెలుసుకునేందుకు వారితో గేమ్‌ ఆడించాడు బిగ్‌బాస్‌. మొదటిరోజే ఇంటిసభ్యులను క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ అంటూ మూడు భాగాలుగా విడిపోవాలన్నాడు. విశేష అధికారాలుండే క్లాస్‌ టీమ్‌లో బాలాదిత్య, శ్రీహాన్‌, సూర్య ఉండగా రేవంత్‌, గీతూ, ఇనయ సుల్తాన ట్రాష్‌లోకి.. మిగిలినవారంతో మాస్‌ టీమ్‌లోకి వచ్చారు. అయితే సమయానుసారం ఛాలెంజ్‌లు ఇస్తూ కంటెస్టెంట్లు టీమ్‌ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో మొదటి ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి గెలిచి అతడు క్లాస్‌ టీమ్‌లో ఎంటరయ్యాడు. అందులో ఉన్న శ్రీహాన్‌ మాస్‌ టీమ్‌ సభ్యుడిగా మారిపోయాడు.

ఈరోజు బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ట్రాష్‌ నుంచి ఒకరు క్లాస్‌ సభ్యుడితో స్వాప్‌ చేసుకోవచ్చని చెప్పాడు. అలా గీతూ క్లాస్‌లోకి ఎంటరవగా బాలాదిత్య ట్రాష్‌లోకి వచ్చి పడ్డాడు. గీతూ అలా ఓ మెట్టు ఎక్కిందో లేదో అప్పుడే పర్ఫామెన్స్‌ మొదలుపెట్టేసింది. ఇనయను టార్గెట్‌ చేసి కావాలని ఆమెతో పనులు చేయించుకుంది. మాస్‌ సభ్యులతో సపర్యలు చేయించుకుని సంబరపడిపోయింది. మరోవైపు రేవంత్‌ సడన్‌గా బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశాడు. అటు ఇనయ కూడా ఓటమిని జీర్ణించుకులేక ఓపక్క ఏడుస్తూనే ప్రతిదానికీ వాదనకు దిగడం చికాకు పుట్టించింది.

ఆ తర్వాత ఇచ్చిన టాస్కుల్లో గెలిచిన రేవంత్‌, నేహా మాస్‌ టీమ్‌లోకి, బాలాదిత్య, అభినయ ట్రాష్‌లోకి వెళ్లారు. ఫైనల్‌గా ఈ క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ టాస్క్‌ ముగిసిందని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్‌ టీమ్‌లో ఉన్న కారణంగా ఈ ముగ్గురూ నామినేషన్స్‌లో లేరని ప్రకటించాడు బిగ్‌బాస్‌. అంతేకాదు, వీరు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ట్రాష్‌ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా ఈ వారం నేరుగా నామినేషన్‌లోకి వచ్చారు.

ఇదిలా ఉంటే భార్యాభర్తలైన మెరీనా- రోహిత్‌ మధ్య చిన్నచిన్నగొడవలు వచ్చాయి. హగ్‌ ఇస్తుంటే కూడా వదిలించుకుని వెళ్లిపోయాడంటూ బుంగమూతి పెట్టుకుంది మెరీనా. తను చెప్పేది కూడా వినిపించుకోవడం లేదని అలక పూనింది. దీంతో రోహిత్‌ సారీ చెప్పి చూసినా ఆమె పట్టించుకోలేదు. మొత్తానికి ఈ వారం ఇనయ, బాలాదిత్య, అభినయ నామినేషన్స్‌లోకి వచ్చారు. ఉన్న ముగ్గురిలో ఇనయపై నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మరి వీళ్లతో పాటు ఇంకెవరు నామినేషన్స్‌లోకి వస్తారో తెలియాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఇనయాకు చుక్కలు చూపించిన గీతూ.. టాస్క్‌ తర్వాత పరిస్థితి ఏంటి?
ఏంది రేవంత్‌, అప్పుడే బూతులు మొదలెట్టావా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement