Bigg Boss 6 Telugu Latest (Day 02) Episode Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బాత్రూంలో ‘హెయిర్స్‌’ లొల్లి.. అతి చేసిన గీతూ!

Published Tue, Sep 6 2022 9:19 AM | Last Updated on Tue, Sep 6 2022 2:33 PM

Bigg Boss 6 Telugu Latest Episode Highlights - Sakshi

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్ర‌వ‌ర్సీలు.. ఒక‌రినొక‌రు అరుచుకోవ‌డం.అయితే ప్ర‌తీసారి సీజ‌న్ మొద‌లైన త‌ర్వాత క‌నీసం వారం రోజుల త‌ర్వాత ఈ చిచ్చు మొద‌లవుతుంది. కానీ ఆరో సీజన్‌లో మాత్రం రెండో రోజే ర‌చ్చ మొద‌లైపోయింది. గలాట గీతూ, ఇనయ సుల్తానాల మధ్య ‘హెయిర్స్‌’వార్‌ జరిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. గీతూకి ఓ సలహా ఇచ్చాడు బాలాదిత్య, కీర్తి భట్‌తో సూర్య పులిహోర కలపడం స్టార్‌ చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్‌ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్‌ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్‌ తనకు ఈ టాస్క్‌ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై ఇనయ సుల్తానాతో గొడవ జరిగింది. నువ్వు తిక్కదానికి అంటే.. నువ్వు తిక్కదానివి అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఈ లొల్లిపై గీతూకు బాలాదిత్య ఓ సలహా ఇచ్చాడు. నువ్వు చెప్పిన విషయం కరెక్టే అయినా... విధానం సరిగా లేదని గీతూతో అన్నాడు. అయితే  ఆ సహాలను గీతూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలోనే ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ఇచ్చాడు. ‘క్లాస్.. మాస్‌.. ట్రాష్’అనే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌ మూడు భాగాలుగా విడిపోవాలి. క్లాస్‌కు  విశేషాధికారాలుంటాయి.

వారు ఏ పనైనా చేసుకోవచ్చు. వీఐపీ బాల్కనీ వాడుకోవచ్చు. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉంటుంది. నేరుగా నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారు. ఇక ట్రాష్‌ సభ్యులు గార్డెన్‌ ఏరియాలోనే వంట చేసుకోవాలి. కప్టెన్సీ పోటీదారులయ్యే అర్హత ఉండదు. నేరుగా నామినేషన్‌లోకి వెళ్తారు. మాస్‌ సభ్యులు సామాన్యులుగా ఉంటారు. వారికి ఎలాంటి అధికారాలు  ఉండవు. చివరకు మాస్ సభ్యుల్లో ముగ్గురు క్లాస్, ముగ్గురు ట్రాష్ ఉంటారు’అని బిగ్‌బాస్‌ ఇచ్చిన లెటర్‌ని చదివేసింది ఫైమా. ఆ తర్వాత ఇంటిసభ్యులు ఓటింగ్‌కి వెళ్లారు.అందులో బాలాదిత్య, శ్రీహాన్, సూర్యలు క్లాస్.. రేవంత్, గీతూ, ఇనయ సుల్తానలు ట్రాష్‌‌లోకి వచ్చారు. మిగిలిన అందరూ కూడా మాస్ సభ్యులు అని ఓటింగ్ లో తేల్చారు.

ఇక కెప్టెన్సీలో ఎవరికి సపోర్ట్‌ చేయాలో వాసంతి, ఆరోహి, షానిలు చర్చించుకున్నారు. మరోవైపు వాసంతికి నాగార్జున ఇచ్చిన మూడు బ్యాడ్జీలను తనకు నచ్చిన వాళ్లకి పెట్టేసింది. హగ్‌ బ్యాడ్జ్‌ గీతూకి, పంచ్‌ బ్యాడ్జ్‌ షానీకి, కిస్‌ బ్యాడ్జ్‌ మెరినాకి ఇచ్చేసింది. 


ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో రెండో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఓ అవకాశం ఇచ్చాడు. సమయానుసారం మాస్‌ మరియు ట్రాష్‌ సభ్యులకు బిగ్‌బాస్‌ కొన్ని చాలెంజెస్‌ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో  గెలిచిన వారికి  ఓ తరగతి పైకి వెళ్లే అవకాశం ఉటుంది. గెలిచిన సభ్యులు వెళ్లిన తరగతి నుంచి ఒకరు స్వాప్‌ అయి ఒక మెట్టు కిందకు దిగుతారు. క్లాష్‌..మాస్‌..ట్రాష్‌’టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరు ఏ తరగతిలో ఉంటే..వారికి ఆ తరగతిలో ఉన్న ప్రయోజనాలు లేదా నష్టాలు వర్తిస్తాయి. ప్రతి చాలెంజ్‌లో క్లాస్‌లొని ముగ్గురు సభ్యులు సంచాలకులుగా వ్యవహరిస్తారు. 

ఇందులో భాగంగా మొదటి చాలెంజ్.. కొబ్బరి బోండాల యుద్దం అంటూ టాస్క్ ఇచ్చాడు. ఈ ఆట ఆడేందుకు ఆది రెడ్డి, ఇనయ ముందుకు వచ్చారు. ఈ గేమ్‌లో ఆదిరెడ్డి గెలిచి  క్లాస్ సభ్యుడిగా మారిపోయాడు. క్లాస్ సభ్యుల్లోంచి శ్రీహాన్ మాస్ సభ్యుడిగా వచ్చాడు.

ఇక కీర్తిభట్‌తో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు సూర్య. ఆమె వేసుకున్న టీషర్ట్‌ బాగుందని, అలాంటిదే తన వద్ద ఉందని చెప్పగా..అవునా..మరి వేసుకోవాల్సింది అని కీర్తి కౌంటర్‌ ఇచ్చింది. రేపు వేసుకుంటాలే అని సూర్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇంకేంటి పిచ్చి అని స్వీట్‌గా పిలవగా... ‘ఏమన్నావ్‌..’ అని కీర్తి షాకైంది.. పిచ్చి అని నేను అంటుంటాను అలా అనడం నాకు ఇష్టమని సూర్య అంటే..పిచ్చి అనేది ఫేవరేట్ వర్డ్ అంటూ కీర్తి తెగ సిగ్గు పడుతుంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఓడిపోయానని ఇనయ బాధ పడుతుంటే.. అభినయ శ్రీ వచ్చి ఓదార్చింది. 

ట్రాష్‌ సభ్యులకు  ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మీరు ట్రాషీ కాదని చెప్పండి. గర్వించే విషయాలను, సందేశాలను మిగతా సభ్యులకు వినిపించండి. వాటిని బాటిల్‌పై రాసి స్విమ్మింగ్‌ పూల్‌లో వేయండి’అని బిగ్‌బాస్‌  చెప్పాడు. 

మొదటగా ఇనయ మాట్లాడుతూ..  ‘ముజబుర్ రెహ్మాన్.. మా నాన్న.. నన్ను తారగా గుర్తించాడు.. నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తి.. తాను ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నాడు. వెళ్లాడు.. కానీ ఆర్థిక కష్టాలు., ఇంట్లో సమస్యలు.. వల్ల వెనక్కి వచ్చాడు.. మాతోనే ఉండిపోయాడు.. రెండేళ్ల క్రితం చనిపోయాడు.. డాడీ కలను పూర్తి చేసేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఇక్కడకు రావడానికి కారణం మా డాడీనే.. పారిపోయి వచ్చాను..నేను యాక్ట్ చేయడం మా మ్మమ్మీకి ఇష్టం లేదు.. ఫుడ్ కూడా లేని స్థితి.. హాస్టల్లో అన్నంలో నీళ్లు పోసుకుని తిన్నాను.. మళ్లీ ఈ రోజు ఇక్కడ కూడా అదే గుర్తొచ్చింది..అలానే తిన్నాను. ఐ లవ్ మై డాడ్. అందరూ పిలవాలని.. ఇనయ రెహ్మాన్ అని పేరు పెట్టుకున్నాను. ఇంత పెద్ద షోలో చెబుతున్నాను.. ఐ లవ్ మై డాడ్’ అంటూ  కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది విని కీర్తిభట్‌  వెక్కివెక్కి ఏడ్చింది. తన గతంలో గుర్తుచేసుకొని బాగా ఎమోషనల్‌ అయింది. వీరిని గీతూ భయపడింది. నేను ఇప్పుడు చెప్పలేను బాబోయ్‌ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కచ్చితంగా చెప్పాల్సిందే అనడంతో.. కొంచెం టైం కావాలని కోరింది. దీంతో రేవంత్‌ తన గురించి చెప్పుకొచ్చాడు. ‘నాన్న చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఆరో తరగతి వరకు చెప్పలేదు.. బాగా చదువుకుంటే వస్తాడని అన్నారు.. ఆయన లేరనే విషయం తెలియక ముందు అమెరికా వెళ్లాలని.. మా డాడీని చూడాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అమ్మానాన్నల ప్రేమ, ప్రజల ప్రేమ’ అని అన్నాను.

ఇక గీతూ మాట్లాడుతూ.. ‘సంతోషం, ఏడుపు, ప్రేమ, కోపం ఏదీ కూడా ఆపుకోలేదు.. ఈ రోజు నన్ను ఇక్క డ అందరూ ట్రాషీ అన్నారు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను అలానే అనేవాళ్లు.. నేను ఎదుటి వాళ్లను పట్టించుకోలేదు.. నన్ను గౌరవిస్తేనే నేను గౌరవిస్తా.. మా ఊర్లో, బంధువులు అందరూ కూడా ఎవ్వరినీ కూడా నాతో మాట్లాడొద్దని అనేవాళ్లు.. అందరూ నన్ను దూరం పెట్టేశారు.. రివ్యూలు చెప్పినప్పుడు నన్ను జనాలు గుర్తించారు.. మోటివేషన్ వీడియోలు చేసినప్పుడు నాలో విషయం ఉందని గమనించారు.. జనాలు షేర్ చేశారు.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాను.. నా ఫాలోవర్లే వల్లే ఇంత దూరం వచ్చింది.. నాలో టాలెంట్ ఉందని, నన్ను స్టార్ అని జనాలు గుర్తించారు. నేను స్టార్ అని తెలిసిన తరువాత చాలా మంది వచ్చారు.. అంతకంటే ముందే నా ఫాలోవర్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు.. సిగ్గు లేకుండా ఏడుస్తున్నా. ఏం చెప్పానో నాకు తెలియడం లేదు.. గలీజ్ గా ఉంది.’తనదైన శైలీలో చెప్పుకొచ్చింది గీతూ. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో గీతూ కొంచెం అతి చేసినట్లు అనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement