Bigg Boss 6 Telugu: Anchor Sravanthi Chokkarapu Review On BB6 Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: శ్రీసత్య కన్నింగ్‌, వాసంతి ఎడ్డిది.. యాంకర్‌ స్రవంతి రివ్యూ

Published Thu, Oct 13 2022 7:36 PM | Last Updated on Sat, Oct 15 2022 5:44 PM

Bigg Boss 6 Telugu: Anchor Sravanthi Chokkarapu Review On Housemates - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరుగుతుంది? సోషల్‌ మీడియాలో హౌస్‌మేట్స్‌ గురించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇలా అన్ని విషయాలను కెఫె ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటోంది అరియానా గ్లోరీ. ఒక్క అరియానానే కాదు.. ఈ షోకు నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌గా విచ్చేస్తూ బిగ్బాస్‌ షో గురించి రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ కెఫె షోకి మాజీ కంటెస్టెంట్‌ స్రవంతి చొక్కారపు వచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. 'ఫస్ట్‌ గీతూ అస్సలు నచ్చలేదు. కానీ రానురానూ అద్భుతంగా ఆడుతోంది. రేవంత్‌, గీతూ, శ్రీహాన్‌.. కచ్చితంగా టాప్‌ 5లో ఉంటారు. సూర్య విషయానికి వస్తే.. ఒక ఎమోషన్‌కు అటాచ్‌ అయితే గేమ్‌ వీక్‌ అవుతుందని నేను నమ్ముతాను. ఆరోహి ఉన్నప్పుడు ఏంది? ఇలా చేస్తున్నాడనుకున్నాను. సరే ఆరోహి పోయింది, ఆట బాగా ఆడతాడనుకుంటే మళ్లీ ఈ ఇనయ పిల్లను తగులుకున్నాడేంట్రా నాయనా అనిపించింది.

అటు అర్జున్‌ కల్యాణ్‌ కూడా పదేపదే శ్రీసత్య వెనకాల పడటం అవసరం లేదు. ఆ ఒక్క విషయం నుంచి బయటపడితే తను బాగా ఆడగలడు. వాసంతి.. డ్యాన్స్‌ చేయలేదని ఆదిరెడ్డిని నామినేట్‌ చేయడం ఘోరం. మరీ ఎడ్డిదానిలా ప్రవర్తించింది. ప్రతి సీజన్‌లో ఒక కోపిష్టి ఉంటాడు. అలా ఈ సీజన్‌లో రేవంత్‌ ఒకరు. ఆ కోపాన్ని కొంత కంట్రోల్‌ చేసుకుంటే అతడు బెస్ట్‌ కంటెస్టెంట్‌ అవుతాడు. ఈ సీజన్‌లో మోస్ట్‌ కన్నింగ్‌ కంటెస్టెంట్‌ శ్రీసత్య' అని హౌస్‌మేట్స్‌ గురించి రివ్యూ ఇచ్చింది స్రవంతి.

చదవండి: విన్నర్‌ అయిపోతానన్న గీతూ.. టాప్‌ 5లో ఉంటావన్న తండ్రి
సినిమా ఛాన్స్‌ పేరుతో ఇంటికి పిలిచి.. : దర్శకుడి బండారం బయటపెట్టిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement